వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహా సంక్షోభం: ఉద్దవ్ మీకు అన్నీ ఇస్తే.. మీరిలా చేస్తారా..? షిండేపై నితిన్ దేశ్ ముఖ్ విసుర్లు

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర రాజకీయాల్లో కుదుపునకు కారణం.. ఏక్‌నాథ్ షిండే.. అతనికి మంత్రి పదవీ ఇచ్చినా సంతృప్తి చెందలేదు. తిరుగుబాటు చేసి.. ఎమ్మెల్యేలతో క్యాంప్ వేశారు. అయితే క్యాంప్‌నకు వెళ్లి తిరిగి వచ్చినా.. నితిన్ దేశ్‌‌ముఖ్ షిండేపై ఫైరయ్యారు. ఈ రోజు నీ ఎదుగులకు కారణం బాల్ థాకరే, ఉద్దవ్ థాకరే, శివసేన పార్టీ అని పేర్కొన్నారు. మరీ వారిపై తిరుగుబాటు చేయడం ఏంటీ అని మండిపడ్డారు.

 బీజేపీ ఉచ్చులో షిండే

బీజేపీ ఉచ్చులో షిండే


షిండే బీజేపీ ఉచ్చులో చిక్కుకున్నారని ఫైరయ్యారు. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మీకు అన్నీ ఇచ్చిన వారిపై ఇలా చేయడం ఏంటీ అని ఫైరయ్యారు. అంతేకాదు చాలా మంది ఎమ్మెల్యేలు తిరిగి రావాలని అనుకుంటున్నారని మరో ఎమ్మెల్యే కైలాస్ పాటిల్ అన్నారు. ఈయనను కూడా క్యాంప్‌నకు తీసుకెళ్లగా.. నితిన్‌తో కలిసి తప్పించుకుని ముంబై చేరుకున్నారు.

ఉద్దవ్‌కి వ్యతిరేక కుట్ర

ఉద్దవ్‌కి వ్యతిరేక కుట్ర


గుజరాత్ వెళ్లే క్రమంలో ఉద్దవ్ థాకరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందని స్పష్టమైందని తెలిపారు. సూరత్ చేరుకున్న తర్వాత అక్కడ ఉండకూడదని షిండేతో చెప్పానని వివరించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు ముంబైలో ఉన్న నేతలతో మాట్లాడానని తెలిపారు. హైవేపై నడిచి.. ముంబై చేరుకున్నానని వివరించారు.

 30 మంది పోలీసులు

30 మంది పోలీసులు


అయితే కొందరు పోలీసులు వచ్చి బలవంతంగా నితిన్ దేశ్‌ముఖ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని.. కానీ 30 మంది పోలీసులు తనను తీసుకెళ్లారని చెప్పారు. తనకు అక్కడ ఇంజెక్షన్ చేశారని నితిన్ వివరించారు. ఆ తర్వాత ఎలాగోలా తప్పించుకున్నాని తెలిపారు.

ఎమ్మెల్యేల కిడ్నాప్

ఎమ్మెల్యేల కిడ్నాప్


అంతకుముందు ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారని సంజయ్ రౌత్ ఆరోపించారు. వారి బారి నుంచి నితిన్, కైలాస్ మాత్రం తిరిగి వచ్చారని వివరించారు. అంతేకాదు తమతో 21 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని తెలిపారు. వారు తిరిగి వస్తారని పేర్కొన్నారు. దీంతో బలపరీక్ష జరిగినా.. తమదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. కిడ్నాప్ అంశానికి సంబంధించి కైలాస్ పాటిల్ స్పందించారు. తమను బలవంతంగా గుజరాత్ తీసుకెళ్లారని పేర్కొన్నారు.

English summary
Maharashtra Politics cricis:Shinde to not fall prey to the conspiracy BJP is hatching through him against Maharashtra chief minister Uddhav Thackeray Shiv Sena leader Nitin Deshmukh said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X