మోడీ & కో ప్రచారం: అఫ్జల్‌ఖాన్ ఆర్మీతో పోల్చిన ఉద్ధవ్

ముంబై: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా శివసేన పార్టీ అధ్యక్షులు ఉద్ధవ్ థాకరే భారతీయ జనతా పార్టీ పైన, ఆ పార్టీ నాయకుల పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. నరేంద్ర మోడీ కేబినెట్‌ను ఉద్ధవ్ థాకరే అఫ్జల్ ఖాన్ ఆర్మీతో పోల్చారు. ఛత్రపతి శివాజీ కాలంలో అఫ్జల్ ఖాన్ చరిత్ర ఉన్న విషయం తెలిసిందే.

మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు మొదట ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారని, ఆ తర్వాత ఆయన కేబినెట్ అంతా వస్తోందని విమర్శించారు. నాటి అఫ్జల్ ఖాన్‌లా నేడు మోడీ మహారాష్ట్రను జయించేందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. మోడీ, వారి కేబినెట్, బీజేపీ నేతలు మహారాష్ట్రను ముక్కలు చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు.

Uddhav Thackeray compares Team Modi campaign to Afzal Khan's army

అయితే, ఇలాంటి కుయుక్తులను మహారాష్ట్ర ప్రజలు సహించరన్నారు. వారు ఈ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమన్నారు. చరిత్రను చూస్తే గతంలో అఫ్జల్ ఖాన్ కూడా ఇదే రకంగా మరాఠాను జయించేందుకు ప్రయత్నించాడన్నారు.

ఈ సందర్భంగా ఓ ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర విడిపోవాలని మీరు కోరుకుంటున్నారా అని సభకు వచ్చిన ప్రజలను అడిగారు. దానికి అక్కడున్న వారు లేదు లేదు అంటూ నినాదాలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోందని, కానీ ఆ కలలు నెరవేరవన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+