క్షణానికో మాట: ఉగ్రవాది నవేద్‌కు లై డిటెక్టర్ టెస్ట్

హైదరాబాద్: జమ్మూకాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో బిఎస్ఎఫ్ జవాన్లపై దాడికి తెగబడి, గ్రామస్థులను బందీలుగా పట్టుకుని, చివరికి వారి సాహసానికి పట్టుబడ్డ ఉగ్రవాది మహమ్మద్ నవేద్‌ అలియాస్ ఉస్మాన్ ఖాన్‌కు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు ఢిల్లీ కోర్టు ఎన్ఐఏకు అనుమతినిచ్చింది.

మంగళవారం ఉదయం 11 గంటలకు పాలీగ్రఫీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. కాగా, నవేద్ క్షణానికో రీతిన మాట్లాడుతుండడంతో, అతను చెప్పేవి నిజమా? కాదా? అనేది నిర్ధారించేందుకు ఎన్ఐఏ లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించనుంది.

సోమవారం నవేద్‌ను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో విచారించారు. విచారణలో నవేద్ పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడని, లై డిటెక్టర్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని ఎన్ఐఏ కోర్టును కోరింది. దీనికి కోర్టు అనుమతించింది.

Udhampur attack- Mohammad Naved to undergo lie detector test

పోలీసుల విచారణలో నవేద్ తనకు 20 ఏళ్లని, పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందిన వాడినని చెప్పిన సంగతి తెలిసిందే.

కాగా, కసబ్ తరువాత భారత్‌కు సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది నవేద్ కావడంతో, అతని నుంచి వీలైనంత సమగ్ర సమాచారం సేకరించే పనిలో ఎన్ఐఏ అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు సేకరించిన సమాచారాన్ని నిర్ధారించేందుకు లై డిటెక్టర్ పరీక్షలు ఉపకరించనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+