ఉదయనిధి స్టాలిన్‌కు బెంగళూరు కోర్టు సమన్లు
చెన్నై/బెంగళూరు: సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌కు బెంగళూరు కోర్టు సమన్లు జారీ చేసింది. గత సంవత్సరం సనాతన ధర్మ డెంగ్యూ, మలేరియాతో పోలుస్తూ ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో బెంగళూరుకు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేయడంతో బెంగళూరు కోర్టు తమిళనాడు క్రీడా మంత్రిగా ఉన్న ఉదయనిధికి సమన్లు జారీ చేసింది.

కాగా, గత సెప్టెంబర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చుతూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాధుల మాదిరిగానే సనాతన ధర్మాన్ని దేశం నుంచి తరిమికొట్టాలని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రధాని మోడీ కూడా పరోక్షంగా ఆయన వ్యాఖ్యలను ఖండించారు.
పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు ఉదయనిధి స్టాలిన్. సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధమైన సనాతన వ్యవస్థను నిర్మూలించాలని మాత్రమే తాను పిలుపునిచ్చానని చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. అయితే, సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదయనిధిపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలోనే విభజన ఆలోచనలు ప్రోత్సహించే లేదా ఏదైనా భావజాలాన్ని రద్దు చేసే హక్కు ఏ వ్యక్తికీ లేదని మద్రాసు హైకోర్టు.. ఉదయనిధి స్టాలిన్‌ను మందలించింది. మరోవైపు, సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు చేసిన కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యక్తికి కూడా బెంగళూరు కోర్టు సమన్లు జారీ చేసింది.












Click it and Unblock the Notifications