Cockroach Janta Party: బొద్దింకల తొలి విజయం..! చర్చలకు పిలిచిన కేంద్రం..!

నీట్ సహా జాతీయ స్దాయి పోటీ పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఆందోళనలు చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) తమ పంతం నెగ్గించుకునే దిశగా తొలి అడుగు వేసింది. ఇంతకాలం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపడుతున్న కాక్రోచ్ పార్టీ ఇవాళ పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ పార్లమెంట్ మార్చ్ కు పిలుపునిచ్చింది. దీంతో కేంద్రం తప్పనిసరి పరిస్ధితుల్లో స్పందించింది.

గతంలో ముందుగా సీజేపీ నేతలు జిల్లా మేజిస్ట్రేట్, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, కేంద్ర సహాయ మంత్రి స్థాయి అధికారులతో చర్చలు జరపాలని ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ప్రధాని లేదా కేబినెట్ మంత్రి స్థాయి నేతలతోనే చర్చలు జరపాలని పట్టుబడుతూ వారు ఆ ప్రతిపాదనలను తిరస్కరించారు. అలాగే తాము చర్చలు జరిపే మంత్రుల జాబితా ఒకటి డీసీపీకి సీజేపీ నేతలు సమర్పించారు. అనంతరం వారికి జేపీ నడ్డాను వచ్చి కలవాలని కాల్ వచ్చింది. దీంతో సీజేపీ నేతలు అశుతోష్ రాంగా, సౌరవ్ దాస్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిశారు.

Cockroach Janta Party s Parliament March Plan Prompts Centre to Open Talks jp nadda to meet leaders

జేపీ నడ్డాతో జరిగిన సమావేశంలో సీజేపీ ప్రతినిధులు ఒక పరిష్కారాన్ని ప్రతిపాదించారు. సోనమ్ వాంగ్‌చుక్‌ను ఆసుపత్రి నుంచి విడుదల చేసి, జంతర్ మంతర్‌కు వచ్చి అక్కడే నిరాహార దీక్ష విరమించుకునేలా చేయాలన్నది వారి ప్రధాన డిమాండ్. ప్రతిష్టంభనను ముగించి, శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి ఇది సమర్థవంతమైన, ప్రతీకాత్మక మార్గమని సీజేపీ పేర్కొంది. వారి ఇతర రెండు డిమాండ్లలో విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించడం, ఆత్మహత్య చేసుకున్న ప్రతి నీట్ విద్యార్థి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందించడం ఉన్నాయి. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్లకు అంగీకరించేలా కనిపించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+