వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

UGC NET 2021 వాయిదా -కొవిడ్ విలయం కారణంగా కేంద్ర విద్యా శాఖ నిర్ణయం -మళ్లీ ఎప్పుడంటే..

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరి, దాదాపు అన్ని రాష్ట్రాలూ కఠిన ఆంక్షలు, కర్ఫ్యూ నిర్ణయాలు తీసుకుంటుడగా, విద్యా వ్యవస్థపైనా ఆ ప్రభావం తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో జూనియర్ ప్రొఫెసర్ ఫెలోషిప్‌లు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల కోసం యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ (యుజిసి) నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నెట్) సైతం వాయిదా పడింది.

గంటా భార్యను రచ్చలోకి లాగిన వైసీపీ విజయసాయిరెడ్డి -బ్లాక్ టికెట్లతో బతుకు మొదలైందంటూ బాబుపైనాగంటా భార్యను రచ్చలోకి లాగిన వైసీపీ విజయసాయిరెడ్డి -బ్లాక్ టికెట్లతో బతుకు మొదలైందంటూ బాబుపైనా

కొవిడ్-19 మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో యూజీసీ నేష‌న‌ల్ ఎలిజ‌బిలిటీ టెస్ట్‌(నెట్‌) ప‌రీక్ష షెడ్యూల్ వాయిదా ప‌డింది. మే 2 నుండి 17వ తేదీ వ‌ర‌కు జ‌రిగే ఈ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పొఖ్రియాల్ మంగ‌ళ‌వారం తెలిపారు. వాస్తవానికి ఈ ఎగ్జామ్ గతేడాది డిసెంబర్‌లోనే జరగాలి. కానీ గత ఏడాదిగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కొనసాగుతుండటంతో నోటిఫికేషన్ ఆలస్యంగా రిలీజ్ అయింది. షెడ్యూల్ ప్రకారం యూజీసీ నెట్ డిసెంబర్ 2020 సెషన్ ఎగ్జామ్ మే 2 నుంచి మే 17 మధ్య జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా మరోసారి వాయిదాపడింది.

UGC NET 2021 postponed, new exam date to be decided later: All you need to know

కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ఇప్పటికే సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్ రద్దయ్యాయి. 12వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. మరోవైపు ఐసీఎస్‌ఈ టెన్త్ పరీక్షలు కూడా రద్దయ్యాయి. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు రద్దయి, ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. యూపీఎస్‌సీ ఈపీఎఫ్ఓ పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్షల్ని వాయిదా వేసింది. జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా వాయిదా పడ్డాయి.

కామసూత్ర, కొరియర్ బాయ్ -జగన్ బాబాయిపై రఘురామ సంచలనం -నర్సాపురంలో ఉపఎన్నిక, షాక్కామసూత్ర, కొరియర్ బాయ్ -జగన్ బాబాయిపై రఘురామ సంచలనం -నర్సాపురంలో ఉపఎన్నిక, షాక్

యూజీసీ నెట్ ను వాయిదా వేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ టీఏ) సైతం అధికారికంగా ప్రకటించింది. అయితే మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామన్న సంగతి ఎన్‌టీఏ వెల్లడించలేదు. పరీక్షలకు 15 రోజుల ముందే కొత్త తేదీలపై సమాచారం ఇస్తామని ప్రకటించింది. నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉత్త‌ర్వుల ప్ర‌కారం ప‌రీక్ష‌కు క‌నీసం 15 రోజుల ముందు ఎగ్జామ్ షెడ్యూల్‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. ప్ర‌స్తుత కొవిడ్ ఉధృతి కార‌ణంగా విద్యార్థుల ఆరోగ్యాల‌ను దృష్టిలో ఉంచుకుని యూజీసీ నెట్ డిసెంబ‌ర్ 2020 షెడ్యూల్‌ను (మే 2021)ను వాయిదా వేసిన‌ట్లు పోక్రియాల్ పేర్కొన్నారు.

English summary
UGC NET Exam 2021: The UGC NET 2021 May examination has been postponed by the National Testing Agency, NTA amid the ongoing Covid-19 pandemic in the country. As per the schedule, the UCG NET for December 2020 Cycle (May 2021) was scheduled to be held from May 2 to May 17 at various test centres across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X