ఈ ఫామ్ వెంటనే పూరించి పంపండి: ఉక్రెయిన్‌లోని భారతీయులకు ఎంబసీ, తరలింపు ముమ్మరం
న్యూఢిల్లీ/కీవ్: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన మిగిలిన భారత విద్యార్థులను తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులను అక్కడి భారతీయ రాయబార కార్యాలయం మరోసారి అప్రమత్తం చేసింది. ఏయే ప్రదేశాల్లో ఉండిపోయారో వెంటనే తెలపాలని విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుతం ఉన్న ప్రాంతం, మొబైల్ నెంబర్, పాస్ పోర్ట్ నెంబర్ తోపాటు మరిన్ని వివరాలతో కూడిన మరిన్ని వివరాలతో కూడిన దరఖాస్తు పూరించి వెంటనే తమకు తెలియజేయాలని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ నగరాల్లో తీవ్ర పరిస్థితులు నెలకొన్నవేళ ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీ జారీ చేసింది.

కాగా, ఉక్రెయిన్ నుంచి సరిహద్దు దేశాలైన పోలాండ్, హంగరీ, రొమేనియా, స్లోవేకియా నుంచి భారతీయులను స్వదేశానికి తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రత్యేక మిషన్ ముగింపు దశకు చేరుకున్నట్లు హంగరీలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఎంబసీ ఏర్పాటు చేసిన బస కాకుండా, వేర్వేరు చోట్ల ఉన్న వారందరూ వెంటనే బుడాపెస్ట్‌కు చేరుకోవాలని సూచించింది.
మరోవైపు, ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు 'ఆపరేషన్ గంగా' కార్యక్రమం ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 5వ తేదీ నాటికి 13,700 మంది పౌరులను సురక్షితంగా తీసుకువచ్చింది.
All Indian nationals who still remain in Ukraine are requested to fill up the details contained in the attached Google Form on an URGENT BASIS .
— India in Ukraine (@IndiainUkraine) March 6, 2022
Be Safe Be Strong @opganga@MEAIndia@PIB_India@DDNewslive@DDNationalhttps://t.co/4BrBuXbVbz
ఆదివారం నాడు మరో 2వేల మందికిపైగా భారతీయులు స్వదేశానికి చేరుకోనున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు 21వేల మంది ఉక్రెయిన్ సరిహద్దు దాటినట్లు బారత విదేశాంగ శాఖ తెలిపింది. పిసోచిన్, ఖార్కివ్ నగరాల నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా సరిహద్దు దేశాలకు తరలిస్తున్నప్పటికీ.. దాడుల తీవ్రత అధికంగా ఉన్న సుమీ నగరంలో చిక్కుకుపోయిన వారిని సవాలుగా మారింది. అయితే, రష్యా కాల్పులకు విరమణ ఇవ్వడంతో భారతీయులను వెంటనే సరిహద్దు ప్రాంతాలకు చేరుకోవాలని ఎంబసీ వర్గాలు కోరాయి. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు సరిహద్దులకు చేరుకున్నారు. భారత విద్యార్థుల తరలింపునకు ఉక్రెయిన్ తోపాటు రష్యా కూడా సహకరిస్తోంది.












Click it and Unblock the Notifications