మద్యం దుకాణాలపై మాజీ సీఎం దాడి : ఇంట్లోనే బార్ కు అనుమతి - రోడ్డు మీదకు ఫైర్ బ్రాండ్..!!
బీజేపి నాటి ఫైర్ బ్రాండ్.. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. భోపాల్‌లోని ఓ మద్యం దుకాణాన్ని ధ్వంసం చేశారు. ఒక బండను తీసుకొని ఉమా భారతి లిక్కర్ దుకాణంలోకి వెళ్లి..మద్యం బాటిళ్లను ధ్వంసం చేసారు. ఈ వీడియోను స్వయంగా ఉమాభారతి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన ఉమా భారతి రాష్ట్రంలో మధ్య నిషేధం అమలు చేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అందు కోసం ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. 2022 జనవరి 15 నాటికి రాష్ట్రంలో లిక్కర్ విక్రయాలను నిషేధించాలని అల్టిమేటం జారీ చేసారు.
లేకుంటే నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేసారు. మద్యం దుకాణాల ముందు బైఠాయిస్తామని హెచ్చరించారు. ఉమా భారతి ఇటు మద్యం దుకాణాలను ధ్వంసం చేస్తుండగా..అటు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మద్యం విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మద్యం ధరలను తగ్గించింది. కొత్త మద్యం పాలసీలో భాగంగా.. విదేశీ మద్య అమ్మకాలకు అనుమతులు మంజూరు చేసింది. విదేశీ మద్యంపై ఎక్సైజ్ సుంకాన్ని 10-13 శాతం తగ్గించింది. ప్రజలు గతంలో కంటే నాలుగు రెట్లు ఎక్కువ మద్యం ఇంట్లో ఉంచుకోవచ్చని ప్రకటించింది.
#WATCH | Madhya Pradesh: BJP leader Uma Bharti was seen hurling a brick at a liquor store in Bhopal yesterday, where she had arrived with her supporters.
— ANI (@ANI) March 14, 2022
Earlier this year, she had demanded a liquor ban in the state. pic.twitter.com/OOzHw1Rg9Y

Recommended Video
ఆదాయం సాలీనా కోటి రూపాయాల కంటే ఎక్కువ ఉండే వారు తమ ఇంట్లోనే బార్ తెరుచుకొనేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే సమయంలో వారంలోగా దుకాణాలు మూసివేయాలని ఉమా భారతి డిమాండ్ చేసారు. దీంతో..ఇప్పుడు ఉమా భారతి తదుపరి అడుగులు ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది. మోదీ తొలి విడత ప్రభుత్వంలో ఉమా భారతి కేంద్ర మంత్రిగా పని చేసారు. సొంత రాష్ట్రంలో..సొంత పార్టీ అధికారంలో ఉండగా..ఉమా భారతి తీరు ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమైంది. రానున్న రోజుల్లో ఫైర్ బ్రాండ్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మరింత ఆసక్తి కరంగా మారుతోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications