ఢిల్లీ అల్లర్ల కేసులో సంచలనం : ఉమర్ ఖాలిద్, ఖాలిద్ షఫీ నిర్దోషులుగా విడుదల..
2020లో ఉత్తర ఢిల్లీలో చోటు చేసుకున్న మత ఘర్షణల కేసులో విద్యార్థి నేత ఉమర్ ఖలీద్, యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ సభ్యుడు ఖలీద్ సైఫీకి విముక్తి లభించింది. వీరిద్దరినీ ఈ కేసులో నిర్దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీ కోర్టు ఇవాళ సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో వీరిద్దరూ జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది.
ఢిల్లీ అల్లర్లపై నమోదైన ఖజూరీ ఖాస్ ఎఫ్‌ఐఆర్ నుండి వీరిద్దరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి పులస్త్య ప్రమాచల ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీలోని చాంద్‌బాగ్‌లో రాళ్లు రువ్విన కేసులో ఇద్దరికీ బెయిల్ లభించింది. అయితే అల్లర్ల వెనుక పెద్ద కుట్ర పన్నారని ఆరోపిస్తూ నమోదు చేసిన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) సెక్షన్ల కింద వారిపై ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి వీరు జైల్లోనే ఉండే అవకాశముంది. ఉమర్ ఖాలిద్ తో పాటు ఖాలిద్ సైఫీపై ఐపీసీ సెక్షన్ 109, 114, 147, 148, 149, 153-A, 186, 212, 353, 395, 427, 435, 436, 452, 454, 505, 34 మరియు 120 సెక్షన్‌ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టంలోని 3, 4 సెక్షన్లు, ఆయుధాల చట్టంలోని సెక్షన్ 25, 27 కింద కూడా కేసులు నమోదయ్యాయి.

2020 ఫిబ్రవరి 24న ఉత్తర ఢిల్లీలోని చాంద్ బాగ్ పులియా బయట పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి రాళ్లు రువ్వడం ప్రారంభించారని కానిస్టేబుల్ ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా ఈ అభియోగాన్ని నమోదు చేశారు. పోలీసు అధికారి తనను తాను రక్షించుకోవడానికి ప్రక్కనే ఉన్న పార్కింగ్ స్థలానికి పారిపోగా, గుంపు పార్కింగ్ స్థలం షట్టర్‌ను ఎత్తి, లోపల ఉన్నవారిని కొట్టి, కార్లకు నిప్పంటించారు. ఫిబ్రవరి 28, 2020న ఈ కేసును క్రైమ్ బ్రాంచ్‌కి మార్చారు. ఉమర్ ఖలీద్ ఆ గుంపులో భాగం కానప్పటికీ, ఆయనతో పాటు ఖాలీద్ సైఫీ ఈ కేసులో నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని పోలీసులు ఆరోపిస్తున్నారు.
ఉత్తర ఢిల్లీ అల్లర్లలో తాహిర్ హుస్సేన్ భవనాన్ని "ఇటుకలతో కొట్టడం, రాళ్లతో కొట్టడం, పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులు వేయడం" కోసం ఉపయోగించారని ప్రాసిక్యూషన్ కోర్టులో పేర్కొంది. ఈ భవనం మూడవ అంతస్తు, పైకప్పుపై కూడా ఎక్కి గుంపు బాంబులు విసిరినట్లు పోలీసులు చెప్తున్నారు. ఖలీద్‌కు బెయిల్ మంజూరు చేస్తూ, అతనిపై ఉన్న అస్పష్ట ఆధారాల ఆధారంగా జైల్లో ఉంచలేమని కోర్టు పేర్కొంది. దర్యాప్తు పూర్తయి, ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటి నుండి "అల్లరి మూకలో భాగమైన ఇతర వ్యక్తులను గుర్తించి అరెస్టు చేయవలసి ఉంటుంది అనే వాస్తవం కారణంగా అతన్ని సుదీర్ఘంగా జైలులో ఉంచడం సాధ్యం కాదని అని కోర్టు పేర్కొంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications