భారత్ గ్లోబల్ లీడర్: యూఎన్ చీఫ్ కితాబు -కరోనాపై పోరు, వ్యాక్సిన్ తయారీపై ప్రశంసలు
గడిచిన 15 నెలలుగా ప్రంపంచాన్ని పీడిస్తోన్న కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్ గ్లోబల్ లీడర్ పాత్రను పోషిస్తున్నదని ఐక్యరాజ్య సమితి (యూఎన్) జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ అన్నారు. కొవిడ్ పై యావత్తు ప్రపంచం చేస్తున్న పోరులో భారత్ పోషిస్తున్న పాత్రను ఆయన కొనియాడారు.
ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షక దళానికి భారత్ రెండు లక్షల కరోనా టీకాల డోసులు ఉచితంగా అందించనున్నట్లు భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో.. అందుకు గుటెరస్ కృతజ్ఞతలు తెలుపుతూ జయశంకర్‌కు ఫిబ్రవరి 17న లేఖ రాశారు. ఈ విషయాన్ని ఐరాసలో భారత రాయబారి టి.ఎస్.తిరుమూర్తి ఆదివారం ఉదయం ట్విటర్ వేదికగా వెల్లడించారు.
కరోనా అంతానికి భారత్ చేపడుతున్న చర్యలను గుటెరస్ లేఖలో ప్రత్యేకంగా ప్రశంసించారు. కొవిడ్ విలయం తొలినాళ్ల నుంచే ప్రపంచ దేశాలకు భారత్ అందిస్తున్న సేవల్ని గుర్తుచేశారు. గడిచిన 10 నెలల కాలంలో భారత్.. ఏకంగా 150కిపైగా దేశాలకు కీలక ఔషధాలు, మెడికల్ కిట్లు, వెంటిలేటర్లు వంటివి అందిస్తూ కరోనాపై పోరులో 'గ్లోబల్ లీడర్'గా వ్యవహరిస్తోందని యూఎన్ చీఫ్ వ్యాఖ్యానించారు.

యావత్తు ప్రపంచానికి అందుబాటులోకి వచ్చిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ భారత్ తయారీ సామర్థ్యం వల్లే సాధ్యమైందని గుటెరస్ అన్నారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే అనుమతులిచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీని వినియోగానికి మార్గం సుగమమైంది. అలాగే ప్రపంచదేశాలకు సమానంగా కరోనా టీకా అందించాలన్న ఉద్దేశంతో ఐరాస నేతృత్వంలో ఏర్పాటైన కొవాక్స్ బలోపేతానికీ భారత్ సహకరిస్తోందని వెల్లడించారు. కాగా,
గ్లోబల్ గా కరోనా ఇన్ఫెక్షన్లు, మరణాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 11.16కోట్లకు పెరిగాయి. మరణాల సంఖ్య 25 లక్షలకు చేరువైంది. యూరప్, అమెరికాలతోపాటు భారత్ లోని పలు రాష్ట్రాల్లోనూ తాజాగా కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
-
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications