ఒకే ఫ్యామిలీలో ఐదు మంది ఆత్మహత్య, వీడియోలో పిన్ టూ పిన్ చెప్పిన భర్త, భార్య పిల్లలు!
చుట్టుపక్కల నివాసం ఉంటున్న వాళ్ల దెబ్బకు ఒకే ఫ్యామిలీలో అందరూ జీవితంపై విరక్తి పెంచుకున్నారు. కర్ణాటకలోని తుమకూరులోని సదాశివనగర్‌లో నివాసం ఉంటున్నఐదుగురు కుటుంబం సభ్యులు శవమై కనిపించారు. భార్యాభర్తలు వారి ముగ్గురు పిల్లలను హత్య చేసి తరువాత వాళ్లు కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
డెత్ నోట్‌ను గుర్తించిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేశారు. మృతులను గరీబ్ సాబ్ (42), సుమయ్య (35), వారి పిల్లలు హజీరా (14), సుభాన్ (10), మునీర్ (8)గా గుర్తించామని పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రాథమిక నివేదిక ప్రకారం గరీబ్ సాబ్, అతని భార్య తమ ముగ్గురు పిల్లలను చంపిన తర్వాత వెంటనే దంపతులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిసింది.

ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుందని తెలిసింది. ఆత్మహత్యకు ముందు గరీబ్ సాబ్ ఓ వీడియో తీసి అతని బంధువులకు పంపించాడు. గరీబ్ సాబ్, సుమయ్య దంపతులు రెండు పేజీల డెత్ నోట్ కూడా రాశారు. అందులో తమ చావులకు కారణం తన పొరుగున నివాసం ఉండేవాళ్లు, అప్పులు ఇచ్చినవాళ్లు అని రాశారని పోలీసులు అన్నారు. ఒక వీడియోలో గరీబ్ సాబ్ తన పొరుగువారిలో నలుగురి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
మా ఆత్మహత్యలకు వాళ్లే కారణం అని గరీబ్ సాబ్ వీడియోలో ఆరోపించారు. బాధితులు కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్‌కు లేఖ రాసి మా ఆత్మహత్యలకు కారణం అయిన వారి మీద కఠిన చర్చలు తీసుకోవాలని మనవి చేశారు. ఇంటి యజమాని గరీబ్ సాబ్ ఓ సంస్థ నుంచి రూ1. 50 లక్షల రూపాయల రుణం తీసుకుని సరైన సమయంలో తిరిగి చెల్లించలేకపోయాడు.
గరీబ్ సాబ్ నివాసం ఉంటున్న ప్రాతంలోనే అతను కబాబ్ దుకాణం నిర్వహించేవాడు. డెత్ నోట్ ఆధారంగా తుమకూరు పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తుమకూరు జిల్లాలోని సిరా తాలూకాలోని లక్కనహళ్లికి చెందిన గరీబ్ సాబ్ తన పిల్లల చదువుల కోసం తుమకూరు టౌన్ చేరుకుని అక్కడే నివాసం ఉంటూ కబాబ్ సెంటర్ నిర్వహిస్తూ వ్యాపారం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

తుమకూరు జిల్లా ఎస్పీ అశోక్ కేవీ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించి డెత్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. తిలక్ పార్క్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకే ఫ్యామిలీలో ఐదుగురు కుటుంబ సభ్యులు శవమై కనిపించారని ఆదివారం రాత్రి తమకు సమాచారం అందిందని, అక్కడికి పోలీసులు వెళ్లి చూడగా అప్పటికే అందరూ చనిపోయి ఉన్నారని జిల్లా ఎస్పీ ఆశోక్ తెలిపారు.
ముగ్గురు చిన్నారులు మెడకు తాడు బిగుసుకుపోయిన గుర్తులతో మంచంపై పడి ఉన్నారని, ఇంటి యజమాని గరీబ్ సాబ్ ఆత్మహత్య చేసుకునే ముందు వీడియో తీసి బంధువులకు పంపాడని, ఆ వీడియో ఆధారంగా కేసు విచారణ చేస్తున్నామని తుమకూరు జిల్లా ఎస్పీ అశోక్ మీడియాకు చెప్పారు. చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారి వేధింపులు, కేవలం రూ. 1. 50 లక్షల అప్పు కారణంగా ఒకే ఫ్యామిలీలో ఐదు మంది ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications