• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

lockdown: తాగుబోతులకు గుడ్ న్యూస్, షరతులు, ఫస్ట్ బ్రాందీ షాపులు తియ్యండి, తరువాత చూద్దాం !

|

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. పేదలు, కార్మికులు, వలస కూలీలు అన్నమో రామచంద్రా అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. అయితే కొందరు తాగుబోతులు, మందు బాబులు బ్రాందీ, విస్కీ, బీరు, వైన్ అంటూ వాటికోసం వెంపర్లాడుతున్నారు. మందు బాబులకు గుడ్ న్యూస్ చెబుతూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లిక్కర్ విక్రయించడానికి కర్ణాటక ప్రభుత్వం సిద్దం అయ్యింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మద్యం విక్రయించుకోవచ్చని శనివారం సాయంత్రం కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా కరువుతో నాలుకలు పిడచ కట్టుకుపోయిన మందు బాబులు ఎక్కడ ఈ రోజు నుండే బ్రాందీ షాప్ ల ముందు క్యూ కడుతారో అంటూ పోలీసులు హడలిపోతున్నారు.

  Lockdown 3.0: Zones Wide What Will Open And What Will Remain Shut From May 04 | Oneindia Telugu

  సోషల్ మీడియాలో 100 మంది అమ్మాయిలు, ఆంటీల టార్గెట్, ల్యాప్ టాప్ లో రహస్యాలు, గుండా యాక్ట్, బెండ్ !

  కరోనా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు

  కరోనా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు

  కరోనా వైరస్ వ్యాధి కేసుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కరోనా రెడ్ జోన్, కరోనా ఆరెంజ్ జోన్, కరోనా గ్రీన్ జోన్ అనే మూడు జోన్లుగా గుర్తించింది. కరోనా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించిన ప్రాంతాల్లో వ్యాపారాలు చెయ్యడానికి, వాహనాలు సంచరించడానికి కొన్ని నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం విధించింది.

   బెంగళూరు రెడ్ జోన్

  బెంగళూరు రెడ్ జోన్

  కర్ణాటకలో ఆరు జిల్లాలు కరోనా రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి. ఐటీ బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు నగరంతో సహ మైసూరు, బెళగావి, కలబురిగి, విజయపుర, బాగల్ కోటే జిల్లాలు కరోనా రెడ్ జోన్ పరిధిలోకి వస్తాయి. రెడ్ జోన్లలో ఎక్కడ లిక్కర్ విక్రయాలకు చెక్ పెడుతారో అనే ఆందోళనతో ఇన్ని రోజులు మందు బాబులు టెన్షన్ పడ్డారు.

   మూడు జోన్లలో లిక్కర్ సేల్స్ కు గ్రీన్ సిగ్నల్

  మూడు జోన్లలో లిక్కర్ సేల్స్ కు గ్రీన్ సిగ్నల్

  కరోనా రెడ్ జోన్, కరోనా ఆరెంజ్ జోన్, కరోనా గ్రీన్ జోన్ ప్రాంతాల్లో లిక్కర్ విక్రయాలకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్ని జోన్లలో మందు విక్రయించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మందు బాబులు ఎగిరి గంతెస్తున్నారు. కరోనా కష్టకాలంలో సుమారు 40 రోజుల నుంచి లాక్ డౌన్ లో ఉన్న మందు బాబులకు ఒక్కసారిగా వారికి ప్రాణాలు పైకి వచ్చినంత పని అయ్యింది.

   ఆరు అడుగులు, ఐదు మంది మాత్రమే !

  ఆరు అడుగులు, ఐదు మంది మాత్రమే !

  మూడు జోన్లలో మద్యం విక్రయించడానికి ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టింది. లిక్కర్ కొనుగోలు చెయ్యడానికి వెళ్లే మందు బాబులు క్యూలో ఉండాలని, ఒక్కొక్కరికి కనీసం ఆరు అడుగుల దూరం ఉండాలని, బ్రాందీ షాపుల్లో ఐదు మందికి మించి ఒక్కరు కూడా ఉండకూడదని ప్రభుత్వం షరతులు పెట్టింది. మద్యం పార్శిల్ తీసుకోని వెళ్లాలని, అక్కడే కుర్చుని తాగడానికి వీలులేదని కర్ణాటక ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది.

  ఫస్ట్ బ్రాందీ షాపులు తియ్యండి, తరువాత చూద్దాం

  ఫస్ట్ బ్రాందీ షాపులు తియ్యండి, తరువాత చూద్దాం

  లిక్కర్ కొనుగోలు చెయ్యడానికి ప్రభుత్వం షరతులు విధించడంతో మొదట మీరు బ్రాందీ షాపులు తియ్యండి, తరువాత కథ తరువాత చూద్దాం అంటున్నారు మందుబాబులు, కరువు కాలంలో గంజినీళ్ల కోసం పేద ప్రజలు ఎంతగా ఎదురు చూస్తారో అలా మందు బాబులు బ్రాందీ, విస్కీ, బీర్లు తాగడానికి అంతకంటే ఎక్కువ ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. లిక్కర్ తో పాటు పాన్ మసలా, బీడాలు, సిగరెట్లు, బీడీలు, గుట్కాలు విక్రయించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

   బెంగళూరు బస్సులకు బ్రేక్

  బెంగళూరు బస్సులకు బ్రేక్

  కర్ణాటక నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి కర్ణాటక ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు, కర్ణాటకలోని పలు జిల్లాలకు సంచరించడానికి మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. బెంగళూరు నగరంలో మెట్రో రైలుతో పాటు బీఎంటీసీ బస్సులు (సిటీ బస్సులు) సంచరించవని అధికారులు తెలిపారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు సంచరించడానికి కేవలం 50 శాతం బస్సులకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కర్ణాటక రాష్ట్రం మొత్తం బ్రాందీ, విస్కీ, బీర్లు విక్రయించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  English summary
  Coronavirus lockdown: Under the new lockdown guidelines, Karnataka is allowed to sell liquor across the state. The state is divided into three zones, Red, Green and Orange zones. The state is divided into three zones.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X