మాఫియా డాన్ చోటా రాజన్ మృతి -కరోనాతో ఢిల్లీ ఎయిమ్స్‌లో కన్నుమూత -గ్యాగ్‌స్టర్ల వరుస మరణాలు

ముంబై చీకటి సామ్రాజ్యానికి ఒకప్పటి రారాజు, మాఫియా డాన్ గా ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ పొంది, ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తోన్న గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ ఇక లేడు. తీహార్ జైలులో కరోనా కాటుకు గురైనా ఆయన.. ఢిల్లీలోని ఎయిమ్స లో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశాడు. చోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నికల్జే. చనిపోయేనాటికి ఆయన వయసు 62 ఏళ్లు.

ముంబై సహా వివిధ ప్రాంతాల్లో తీవ్ర నేరాలకు పాల్పడి, 70కిపైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న చోటా రాజన్ భారత్ నుంచి పారిపోయి విదేశాల్లో ఉంటూ మాఫియాను నడిపేవాడు. ఇంటర్ పోల్ సాయంతో 2015లో అతణ్ని ఇండోనేసియాలో అరెస్టు చేసిన సీబీఐ అధికారులు.. ఢిల్లీలోని హైసెక్యూరిటీ తీహార్ జైలుకు తరలించారు. ఆరేళ్లుగా తీహార్ జైలులోనే ఉంటోన్న చోటా రాజన్.. గత నెల 26న కరోనా బారినపడ్డాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అతణ్ని ఢిల్లీ ఎయిమ్స్ కు షిఫ్ట్ చేశారు. కరోనాతో పోరాడుతూ డాన్ శుక్రవారం కన్నుమూశాడు.

 Underworld don Chhota Rajan dies due to Covid-19 at AIIMS

ఢిల్లీ సహా పలు జైళ్లలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంలో ఖైదీలు పిట్టల్లా రాలిపోతున్నారు. కొద్ది రోజుల కిందట.. ఇదే తీహార్ జైలులో మరో గ్యాంగ్ స్టర్, ఆర్జేడీ మాజీ ఎంపీ మహమ్మద్ షాహబుద్దీన్ కరోనాతో మృతి చెందారు. జంట హత్యల కేసులో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న షాహబుద్దీన్ కరోనా బారిన పడడంతో జైలు అధికారులు ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇప్పుడు చోటా రాజన్ వంతైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+