వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాఫియా డాన్ చోటా రాజన్ బతికే ఉన్నాడు... ఆ ప్రచారంలో నిజం లేదు... ఎయిమ్స్ కీలక ప్రకటన..

|
Google Oneindia TeluguNews

అండర్ వరల్డ్ మాఫియా డాన్ చోటా రాజన్ మృతి చెందినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ అధికారులు కొట్టిపారేశారు. చోటా రాజన్ ఇంకా బతికే ఉన్నాడని స్పష్టం చేశారు. రాజన్ కరోనాతో మృతి చెందినట్లుగా శుక్రవారం(మే 7) అటు మీడియాలో,ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత కాసేపటికే ఎయిమ్స్ అధికారులు దీనిపై స్పందించి స్పష్టతనిచ్చారు.

ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న 61 ఏళ్ల చోటా రాజన్ కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడ్డారు. ఏప్రిల్ 26న రాజన్‌ను జైలు అధికారులు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటినుంచే రాజన్ అక్కడే చికిత్స పొందుతున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం అతని ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత కాసేపటికే అందులో నిజం లేదని ఎయిమ్స్ బృందం వెల్లడించింది.

Underworld don Chhota Rajan is still alive: AIIMS official

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడిగా భారత్‌లో అనేక నేరాలకు పాల్పడిన చోటా రాజన్ 2015లో ఇండోనేషియాలోని బాలిలో అరెస్టయిన సంగతి తెలిసిందే. 2011లో ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసులో గతేడాది కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. రాజన్‌పై ఉన్న దాదాపు 68 కేసులను సీబీఐ విచారిస్తుండగా.. ఇందులో ఇప్పటికే 4 కేసుల్లో కోర్టులు అతన్ని దోషిగా తేల్చాయి. మరో 35 కేసుల్లో సీబీఐ అధికారుల చార్జిషీట్ దాఖలు చేశారు. వీటిపై తుది విచారణ ఇంకా జరగాల్సి ఉంది.

తొలుత చోటా రాజన్ దావూద్ గ్యాంగ్‌లో ప్రధాన అనుచరుడిగా ఉండేవాడు. ఆ తర్వాత విభేదాల కారణంగా మరో గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు. సుమారు రెండు దశాబ్దాల పాటు భార‌తో పాటు అనేక ప్రపంచ దేశాలకు దొరక్కుండా తన నేర సామ్రాజ్యాన్ని కొనసాగించాడు. 2015లో ఆస్ట్రేలియా పోలీసులు అందించిన సమాచారం మేరకు ఇంటర్ పోల్ వర్గాలు అతన్ని అరెస్ట్ చేశాయి.

English summary
Underworld don and gangster Rajendra Nikalje, also known as Chhota Rajan, is still alive.He was admitted to AIIMS on 26 April after being tested positive for COVID-19.According to news reports, it was said that Chhota Rajan has died due to Covid-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X