వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దావూద్‌కి సురక్షిత స్థావరం: ఏర్పాట్లు చేస్తున్న ఐఎస్‌ఐ?

|
Google Oneindia TeluguNews

Underworld don Dawood Ibrahim to be shifted to safe base out of Pakistan by ISI?
న్యూఢిల్లీ: ఉత్తర వజిరిస్థాన్‌లోని పాకిస్థాన్-అఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను సురక్షితమైన ప్రాంతానికి తరలించడానికి అనువైన ప్రదేశంకోసం పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ వెతుకుతోందని ఆదివారం మీడియా కథనాలు వెల్లడించాయి.

దావూద్‌ను ఇంతకు ముందు థాయలాండ్, నైరోబి, యుఏఈ, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు తరలించాలని అనుకున్న ఐఎస్‌ఐ ఆ ప్రయత్నాలను విరమించుకుందని, ఇప్పుడు దేశంలోనే సురక్షితమైన ప్రాంతానికి ఆయనను మార్చడానికి ఐఎస్‌ఐ ప్రయత్నాలు చేస్తోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

దావూద్‌ను యుఏఈకి మార్చాలనుకున్న ఐఎస్‌ఐ.. చివరి క్షణంలో ఆ ప్రయత్నం విరమించుకున్నట్లు తెలిసింది. అలాగే బంగ్లాదేశ్‌కు భారత్‌తో మంచి సంబంధాలుండడంతో బంగ్లాదేశ్‌కు తరలించాలన్న యోచనను కూడా అది విరమించుకుంది.

దావూద్‌ ఇబ్రహీంకు రక్షణ కల్పించే బాధ్యతను పాకిస్థాన్ సైన్యం, ఐఎస్‌ఐకి చెందిన సీనియర్ అధికారులకు అప్పగించినట్లు తెలుస్తోంది. శనివారం ఓ కార్యక్రమంలో ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దావూద్ ఇబ్రహీం పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లో ఉన్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.

దావూద్‌ ఇబ్రహీంను భారత్‌కు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, పాకిస్థాన్‌పై దౌత్యపరంగా ఒత్తిడి తెస్తోందని కూడా కేంద్రమంత్రి చెప్పారు.

English summary
Underworld don Dawood Ibrahim is hiding on Pak-Afghan border in northern Waziristan while Pakistan's Inter-Services Intelligence (ISI) agency is looking for a safe haven for him, according to reports on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X