work from home: హైదరాబాద్ స్కెచ్, వందల కోట్లు లూటీ, నిరుద్యోగులకు నిక్కర్ మిగిలింది !
వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తో ఇంటి నుంచి పని చెయ్యడానికి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన ఖతర్నాక్ ముఠాను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ అబ్దుల్ అహమ్మద్ నేతృత్వంలో బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు పెద్దఎత్తున దాడులు చేశారు. తెలంగాణకు చెందిన ముగ్గురు నిందితులు హైదరాబాద్ నుంచి, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు, ఇతర రాష్ట్రాల నుంచి మొత్తం 11 మంది బెంగళూరు చేరుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ చీటింగ్ దందా నిర్వహిస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు.
సైబర్ మోసగాళ్లను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్టు అయిన నిందితుల నుంచి 11 మొబైల్ ఫోన్లు, 2 ల్యాప్‌టాప్ లు, 15 సిమ్ కార్డులు, 3 బ్యాంక్ చెక్ బుక్‌లను సైబర్ క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ మోసగాళ్లు ఇప్పటివరకు 2,143 ఖాతాల నుంచి రూ. 158 కోట్లా 94 లక్షలకు పైగా వారి అకౌంట్లకు బదిలీ చేశారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. ప్రస్తుతం పోలీసులు 30 ఖాతాలను సీజ్ చేసి రూ. 62 లక్షల 83 వేల రూపాయల నగదును జప్తు చేశారు.

పార్ట్ టైమ్, వర్క్ ఫ్రమ్ జాబ్స్ కోసం వెతుకుతున్న యువతీ యువకులను లక్ష్యంగా చేసుకున్న నిందితులు పక్కాప్లాన్ తో వారిని ముగ్గులోకి దింపుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌తో సహా సోషల్ మీడియాలో పలు అకౌంట్లలో నిరుద్యోగులకు గాలం వేశారు. ఇంట్లో ఉండే మీరు ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పిస్తామని సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి వారిని వలలో వేసుకుంటున్నారు. రద్దీగా ఉన్న కళాశాలలు, బస్ స్టేషన్‌ల గోడలపై స్టిక్కర్లను అతికించారు. ఇంట్లో కూర్చొని ప్రతినెల వేల రూపాయలు సంపాదించడానికి చక్కటి అవకాశం ఇస్తామని ప్రజలను పలు రకాలుగా నమ్మించి మోసం చేసి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని పోలీసు అధికారులు తెలిపారు.
ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ తో డబ్బు సంపాదించాలనే కోరిక ఉండే యువతీ యువకులను సంప్రదించి మొదట కొంత డబ్బు ఇవ్వాలని సూచించారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా లింక్ పంపి నగదు వారి అకౌంట్లకు బదిలీ చేసుకున్నారు. అదేవిధంగా ఖతర్నాక్ గ్యాంగ్ వేల మందిని మోసం చేసింది. ఈసారి సైబర్ క్రైమ్ పోలీసుల చేతికి చిక్కింది. సైబర్ మోసగాళ్లు కర్ణాటకలోని ఈ రాష్ట్రం వెలుపల నుండి వచ్చి బెంగళూరు నగరంలో నివసిస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ జాబ్ పేరుతో మోసం చేసి పని ఇప్పిస్తానని నమ్మించి వారి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారు.

సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మోసగాళ్లను పట్టుకోవడంలో విజయం సాధించారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం పదకొండు మందిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారు తెలంగాణ, మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారని, నిందితులు 2, 143 మందిని మోసం చేశారని, విచారణలో నిందితుల ఖాతాలకు రూ. 160 కోట్ల నగదు బదిలీ అయ్యిందని, చాలా వరకు డబ్బు స్వాధీనం చేసుకోవడానికి నిందితుల వద్ద ఉన్న బ్యాంకు పత్రాలు, అకౌంట్ బుక్ లు స్వాధీనం చేసుకున్నామని, కేసు విచారణ కొనసాగుతోందని బెంగళూరు సైబర్ క్రైమ్, సీసీబీ పోలీసులు తెలిపారు.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
కామ పిశాచి: 350 వీడియోలు, 180 మంది ఆడపిల్లల జీవితాలు -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications