వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరుద్యోగానికి ఆడవాళ్లే కారణం! పాఠ్య పుస్తకాల్లో షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాయపూర్: ఉద్యోగాం చేసే మహిళలు పెరిగినందువల్లే దేశంలో నిరుద్యోగ శాతం పెరిగిపోతోందని చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సెకండరీ పాఠశాల విద్యార్థులకు బోధించే పాఠ్యాంశంలో ఉంది.

రాష్ట్రానికి చెందిన పదో తరగతి ప్రభుత్వ పాఠ్య పుస్తకంలోని ఓ పాఠంలో ఉద్యోగాలు చేస్తున్న మహిళల వల్లే నిరుద్యోగం పెరుగుతోందని, భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నిరుద్యోగ శాతం పెరిగిందని, అన్ని రంగాల ఉద్యోగాల్లోను మహిళలు పని చేయడమే దీనికి కారణం అని పేర్కొన్నారు.

ఇది తెలుసుకున్న జాష్‌పూర్‌కు చెందిన ఒక ఉపాధ్యాయురాలు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో, విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆ విషయాన్ని మహిళా కమిషన్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ దృష్టికి తెచ్చింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది.

Unemployment due to working women, claims Class 10 textbook in Chhattisgarh

ఇదే సమయంలో విద్యార్థులకు ఈ విధంగా పాఠాలను బోధించడంపై ఆ రాష్ట్రంలోని మహిళా సంఘాలు, సామాజిక ఉద్యమకారులు మండిపడుతున్నారు. విద్యార్థుల పైన ప్రభావం చూపే ఈ అనుచిత పాఠ్యాంశం సరికాదంటున్నారు.

పాఠ్య పుస్తకాల్లో ఇలాంటి తప్పులు గతంలోను పలుమార్లు దొర్లాయి. 2014లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సెకండరీ పాఠ్య పుస్తకాల్లో స్వతంత్ర సమరయోధులను ఉగ్రవాదులుగా పేర్కొన్నారు.

2013లో మహారాష్ట్రకు చెందిన పుస్తకాల్లో అరుణాచల్ ప్రదేశ్ దేశ చిత్రపటం నుంచి అరుణాచల్ ప్రదేశ్‌ను తొలగించారు. 2012లో మరో రాష్ట్రంలో సిబిఎస్సీ సిలబస్‌లో మాంసాహారం తినేవారు అబద్దాలు చెబుతారని పేర్కొన్నారు. అయితే, వాటిని ఆ తర్వాత వెనక్కి ఉపసంహరించుకున్నారు.

English summary
Working women are the cause of rising unemployment, claims Class 10 textbook in Chhattisgarh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X