Viral Video : శోభనం గదిలో వరుడికి ఊహించని షాకిచ్చిన నవ వధువు
పెళ్లి అనేది జీవితంలో ఓ ప్రధాన ఘట్టం. ఒకరకంగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం లాంటిదే. ఎన్నో కలలు,ఆశలతో జీవిత భాగస్వామితో కలిసి సాగే ఈ ప్రయాణం అందంగా ఉండాలని ప్రతీ జంట కోరుకుంటుంది. ఈ క్రమంలో పెళ్లి తర్వాత జరిగే తొలిరాత్రి కార్యం దంపతులను మరింత దగ్గరచేస్తుంది. ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకునేందుకు.. ఒకరితో ఒకరు పెనవేసుకుపోయేందుకు ఆ రాత్రి వేదికవుతుంది. కాబట్టి శోభనం రాత్రిపై సహజంగానే కొత్త జంటలో ఎన్నెన్నో అంచనాలు ఉంటాయి.
తమ జీవిత భాగస్వామిని థ్రిల్ చేసేందుకు కొంతమంది అబ్బాయిలు శోభనం గదిని అదిరిపోయేలా రీతిలో డెకరేట్ చేస్తుంటారు.ఇలాగే ఓ వరుడు కూడా తన భార్యకు సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడు. కళ్లు చెదిరే రీతిలో ఆ గదిని అలంకరించాడు. గదిలోకి అడుగుపెట్టే దగ్గరి నుంచి మంచం మీది వరకూ అంతా పూలతో నింపేశాడు. అయితే ఇంతా చేస్తే... భార్య నుంచి అతను ఊహించిన రియాక్షన్ మాత్రం రాలేదు. పైగా ఆమె రియాక్షన్‌కి అతనికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు.

శోభనం గదిలోకి వచ్చీ రాగానే... ఆ అలంకరణంతా చూసి... 'అంతా పూలతో నింపేస్తే ఎక్కడ నిద్రపోయేది...' అంటూ ఆ నవ వధువు కామెంట్ చేసింది. దీంతో పాపం ఆ నవ వరుడు బిత్తర పోయాడు. భార్యను ఫిదా చేయాలని ప్లాన్ చేస్తే ఇలా ఊహించని రియాక్షన్ ఇవ్వడంతో షాక్ తిన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దుల్హనియా అనే ఇన్‌స్టా ఖాతాలో 'ట్విస్ట్ కోసం వెయిట్ చేయండి...' అన్న క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేశారు. నెటిజన్లు ఈ వీడియో చూసి తెగ నవ్వుతున్నారు. పాపం ఆ కొత్త పెళ్లి కొడుకు అనుకున్నదొకటి.. అయిందొకటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications