శశికళకు భలే షాక్‌లు: ఏరి కోరి చేస్తే కూడా జంప్, జారిపోతున్న ఎమ్మెల్యేలు
శికళ ఏరి కోరి కోశాధికారిగా నియమించుకున్న వ్యక్తి నుంచే ఆమెకు ఎదురుదెబ్బ తగలడం ఆమె బలాన్ని మరింత తగ్గించేదిగా మారింది.
చెన్నై: క్షణ క్షణానికి అనూహ్య మలుపులు తిరుగుతున్న తమిళ రాజకీయంలో ఎడతెగని ఉత్కంఠకు ఎంతకీ తెరపడట్లేదు. రిసార్టుల్లో ఉంచిన ఎమ్మెల్యేల్లో 20మంది తిరుగుబాటు చేస్తున్నారన్న సమాచారం అందుకోగానే వారిని బుజ్జగించేందుకు స్వయంగా శశికళ రంగంలోకి దిగారు.
అయితే వేగంగా మారిపోతున్న సమీకరణాలు శశికళను అంతకంతకు దెబ్బతీస్తున్నాయి. తాజాగా పార్టీ కోశాధికారి దిండిగల్ శ్రీనివాసన్ సైతం పన్నీర్ సెల్వం గూటికి చేరడం శశికళకు ఊహించని షాక్ ఇచ్చినట్టయింది.

ఏడు రోజుల క్రితం పన్నీర్ సెల్వం చేసిన తిరుగుబాటును నిరసిస్తూ.. ఆయన స్థానంలో దిండిగల్ శ్రీనివాస్ ను కోశాధికారిగా శశికళ నియమించారు. శశికళ ఏరి కోరి కోశాధికారిగా నియమించుకున్న వ్యక్తి నుంచే ఆమెకు ఎదురుదెబ్బ తగలడం ఆమె బలాన్ని మరింత తగ్గించేదిగా మారింది.
ఇదిలా ఉంటే, కాంచీపురం ఎస్పీ ముత్తరసి ఆధ్వర్యంలో గోల్డెన్ బే రిసార్టు చేసిన దాడిలో ఇప్పటిదాకా 92మంది ఎమ్మెల్యేలను గుర్తించినట్టు సమాచారం అందుతోంది. వీరిలో 20మంది మా మద్దతుదారులేనని, వారిని బయటకు పంపించాలని పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్ చేస్తోంది.
ఎమ్మెల్యేల తిరుగుబాటుతో శశికళలో అసహనం తారాస్థాయికి చేరుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేలను గట్టిగా హెచ్చరించడంతో పాటు వారిపై తన పట్టు నిలుపుకునేందుకు శశికళ శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఎమ్మెల్యేలతో ఉద్వేగంగా శశికళ
శశికళ గోల్జెన్ బే రిసార్టులో తన వర్గం శాసనసపభ్యులతో సమావేశమయ్యారు. వారితో మాట్లాడుతూ ఆమె తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్యేలను నిర్బంధించి తన వైపు తిప్పుకుంటున్నట్లు వచ్చిన ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. ఎమ్మెల్యేలను నిర్బంధించినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని శశికళ అన్నారు.












Click it and Unblock the Notifications