Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

UNION BUDGET 2020: డిజిటల్ ఇండియా..మూడు లక్ష్యాలతో ముందుకు

Recommended Video

    #Budget 2020 : Great Offer To Young Engineers !

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ఈరోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు . ఉదయం 11 గంటలకు లోక్‌సభలో నిర్మల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ ను మూడు లక్ష్యాలతో రూపొందించామని ఆమె చెప్పారు. డిజిటల్ ఇండియాకి పెద్ద పీట వేసినట్టు ప్రకటించారు .

    మూడు లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నామన్న మంత్రి

    మూడు లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నామన్న మంత్రి

    కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-2021 బడ్జెట్ ప్రవేశపెట్టారు . ఈసారి బడ్జెట్ లో డిజిటల్ ఇండియాకు ప్రాధాన్యత ఇచ్చినట్టు నిర్మల పేర్కొన్నారు. మూడు లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నామన్న మంత్రి నిర్మల మొదటిది న్యూ ఇండియా, రెండవది సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, మూడవది ప్రజా సంక్షేమమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా డిజిటల్ లావాదేవీలే ఎక్కువగా జరుగుతన్న కారణంగా ముఖ్యంగా దేశవ్యాప్తంగా డిజిటల్ ఇండియాకే పెట్ట పీట వేశామన్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.

    భారత్ నెట్‌ కోసం.. రూ.6000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటన

    భారత్ నెట్‌ కోసం.. రూ.6000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటన

    దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిన కారణంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అందరికీ ఆవాసం ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకూ డిజిటల్ విధానంలో 40 కోట్ల మందికి జీఎస్టీ రిటర్నల్‌ దాఖలు చేశారని ఆమె పేర్కొన్నారు. ఇక భారత్ నెట్ ద్వారా లక్ష గ్రామ పంచాయితీలను అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. భారత్ నెట్‌ కోసం.. రూ.6000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

     ఈజ్ ఆఫ్ లివింగ్ డిజిటల్ ఇండియాతో సాధ్యమైందన్న నిర్మలా సీతారామన్

    ఈజ్ ఆఫ్ లివింగ్ డిజిటల్ ఇండియాతో సాధ్యమైందన్న నిర్మలా సీతారామన్


    ప్రతి జిల్లాను ఎగుమతులకు అనువైన హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఎగుమతి దారులకు అనువుగా సుంకాలకు సంబంధించి డిజిటల్ రీఫండ్ సౌకర్యాన్ని అమలు చేస్తామన్నారు. కేంద్రం, రాష్ట్రాల్లో ఇన్వెస్ట్ మెంట్ క్లియరన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని.. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తికి కొత్తపథకం తీసుకురానున్నట్లు తెలిపారు. నేషనల్ రిక్రూట్ మెంట్ ఎజెన్సీ ఏర్పాటుకు నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఈజ్ ఆఫ్ లివింగ్ పదాన్ని పదేపదే ప్రస్థావించిన నిర్మలా డిజిటల్ ఇండియా ద్వారా అది సాధ్యమైందని పేర్కొన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+