జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయం.. వాటిపై జీఎస్టీ రద్దు !
జీఎస్టీలో 12%, 28% స్లాబులు తొలగించాలని.. 5%, 18% స్లాబులే కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన.. 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. పన్ను రేట్లపై రాష్ట్రాలు, కేంద్రం విస్తృతంగా చర్చించిన తర్వాత ఈ విధంగా ప్రకటించారు.
రెండు స్లాబులకే గ్రీన్‌సిగ్నల్..
కౌన్సిల్ నిర్ణయం ప్రకారం ఇకపై జీఎస్టీలో రెండు స్లాబులు మాత్రమే అమలులో ఉండనున్నాయి. ప్రస్తుత 12%, 28% స్లాబులను రద్దు చేసి.. 5% & 18% స్లాబులను కొనసాగించాలని తీర్మానించారు. కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానున్నాయి. మొదట దీపావళి నుంచి అమలుపై ఆలోచించినా.. ముందుగానే అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీ రద్దు..
ప్రజలకు ఊరటనిచ్చే మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది కౌన్సిల్. ఇప్పటి వరకు అమలులో ఉన్న హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేసింది. దీని వలన ఇన్సూరెన్స్ ప్రీమియాలు గణనీయంగా తగ్గి, సాధారణ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని కౌన్సిల్ భావిస్తోంది.
లగ్జరీ వస్తువులపై 40% పన్ను..
సాధారణ వస్తువులపై పన్నును తగ్గించినప్పటికీ, లగ్జరీ వస్తువులపై మాత్రం 40% వరకు జీఎస్టీ విధించనున్నారు. అధిక విలువ కలిగిన ఉత్పత్తులు, విలాసవంతమైన వస్తువులపై ఈ పన్ను అమలు కానుంది.
Now, items which earlier had 28 percent GST have been reduced to 18 percent.
— BJP (@BJP4India) September 3, 2025
This includes many products that meet the aspirations of the middle class.
For example, ACs, dishwashing machines, small cars, and motorcycles of 350cc or less.
With this, all TVs are now at 18… pic.twitter.com/gS4CHIgKNB
కాగా బీహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ.. ఈ నిర్ణయాలకు రాష్ట్రాలన్నీ ఏకాభిప్రాయంతో మద్దతు ఇచ్చాయని చెప్పారు. అలానే ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా మాట్లాడుతూ.. మద్యం, పొగాకు వంటి డీమెరిట్ వస్తువులపై పన్ను పెంపు విషయంపై ఇంకా చర్చ జరగలేదని తెలిపారు. "40% కంటే ఎక్కువ పన్ను విధించాలా వద్దా అనే అంశంపై తర్వాత నిర్ణయం తీసుకుంటాం" అని చెప్పారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications