వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజ‌య్ మిశ్రా ఓ పెద్ద క్రిమిన‌ల్- రాహుల్ గాంధీ ఫైర్‌

|
Google Oneindia TeluguNews

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖింపూర్ ఖేరి ఘ‌ట‌న లోక్‌స‌భ‌ను కుదిపేసింది. కేంద్ర మంత్రి మండ‌లి నుంచి అజ‌య్‌మిశ్రాను తొల‌గించాలంటూ ప్ర‌తిప‌క్షాల నిర‌స‌న‌లు, డిమాండ్‌ల‌తో స‌భ ద‌ద్ద‌రిల్లింది. కేంద్రం తీరుపై కాంగ్రెస్ ఎంపీ, సీనియ‌ర్ నేత రాహుల్ గాంధీ మండిప‌డ్డారు. కేంద్ర స‌హాయ‌ మంత్రి అజ‌య్ మిశ్రా పెద్ద క్రిమిన‌ల్ అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ల‌ఖింపూర్ ఖేరి సంఘ‌ట‌న ముంద‌స్తు కుట్ర ప్ర‌కార‌మే జ‌రిగింద‌ని దీని వెనుక ఎవ‌రు ఉన్నారో అంద‌రికీ తెలుసని మండిప‌డ్డారు.

 ద‌ద్ద‌రిల్లిన లోక్‌స‌భ‌

ద‌ద్ద‌రిల్లిన లోక్‌స‌భ‌

ల‌ఖింపూర్ ఖేరి ఘ‌ట‌నపై పార్ల‌మెంటు ద‌ద్ద‌రిల్లింది. ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే ఈ కుట్ర జ‌రిగింద‌ని సిట్ అధికారులు వెల్ల‌డించిన నేప‌థ్యంలో కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి అజ‌య్ మిశ్రాను వెంట‌నే ప‌ద‌వి నుంచి త‌ప్పంచాల‌ని ప్ర‌తిప‌క్షాలు లోక్‌స‌భ‌లో ఆందోళ‌న‌కు దిగారు. ఈ ఘ‌ట‌న ఒక కుట్ర. దీనికి కార‌కులు ఎవ‌రో .. ఎవ‌రి కుమారుడికి ఈ ఘ‌ట‌న‌తో సంబంధం ఉందో అంద‌రికి తెలుసుని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిప‌డ్డారు. కుట్ర ప‌న్ని అన్న‌దాత‌ల‌ను పొట్ట‌న పెట్టుకున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 అజ‌య్ మిశ్రా పెద్ద క్రిమిన‌ల్‌

అజ‌య్ మిశ్రా పెద్ద క్రిమిన‌ల్‌

రైతుల మ‌ర‌ణానికి కార‌ణ‌మైన కేంద్ర‌ మంత్రి అజ‌య్ మిశ్రా రాజీనామా చేయాల‌ని, వెంట‌నే అత‌నిని శిక్షించాల‌ని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అజ‌య్ మిశ్రా ఒక పెద్ద క్రిమిన‌ల్ అని మండిప‌డ్డారు. బాధితుల కుటుంబాల‌కు న్యాయం చేయాల‌ని కోరారు. లఖింపూర్ ఖేరి ఘ‌ట‌న‌పై పార్ల‌మెంటులో స‌మ‌గ్ర చ‌ర్చ జర‌గాల్పిందే అని డిమాండ్ చేవారు. అయితే ప్రధాని మోదీ ఒప్పుకోవ‌డంలేద‌ని.. మంత్రిని వెనుకేసుకోస్తున్నార‌ని రాహుల్ గాంధీ ఆగ్ర‌హం వ్య‌కం చేశారు.

ల‌ఖీంపూర్ ఖేరి బాధితుల‌కు న్యాయం చేయండి

ల‌ఖీంపూర్ ఖేరి బాధితుల‌కు న్యాయం చేయండి

మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాల ఆరుపులు, నిర‌స‌న‌ల‌తో లోక్‌స‌భ ద‌ద్ద‌రిల్లింది. విప‌క్ష సభ్యులు వెల్‌లోకి వెళ్లి కేంద్రానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ల‌ఖీంపూర్ ఖేరి బాధితుల‌కు న్యాయం చేయాల‌ని , మంత్రిని ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని ప్లకార్డులు ప‌ట్టుకుని ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ ఆందోళ‌న‌ల‌తో లోక్‌స‌భ స్పీక‌ర్ స‌భ‌ను కొంత సేపు వాయిదా వేశారు. కాగా ఈ కేసు కోర్టు ప‌రిధిలో ఉన్నందున దీని గురించి చ‌ర్చించ‌లేమ‌ని మంత్రి ప్ర‌హ్లాద్ జోషి చెప్పారు. ఆటు రాజ్య‌స‌భ‌లోనూ ఇదే అంశంపై స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు. స‌భ్యుల నిర‌స‌న‌ల మ‌ధ్య రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ స‌భ‌ను కొంత సేపు వాయిదా వేశారు.

అజ‌య్ మిశ్రా రాజీనామాకు ప‌ట్టు..

అజ‌య్ మిశ్రా రాజీనామాకు ప‌ట్టు..


కేంద్రం తీసుకువ‌చ్చిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖింపూర్ ఖేరిలో నిరస‌న తెలుపుతున్న రైతుల‌పైకి ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో కేంద్ర‌ మంత్రి అజ‌య్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లింది. అ దుర్ఘ‌ట‌న‌లో న‌లుగురు రైతులు మృతి చెందారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో మ‌రో న‌లుగురు మ‌ర‌ణించారు. ఈ హింసాత్మ‌క ఘ‌ట‌న‌పై సిట్ విచార‌ణ జ‌రిపి కోర్టుకు నివేదిక స‌మ‌ర్పించింది. ముంద‌స్తు కుట్ర‌గానే ఈ సంఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు వెల్ల‌డించింది. దీంతో ఈ ఘ‌ట‌న‌కు బాధ్య‌త కేంద్ర స‌హాయ‌ మంత్రి అజ‌య్ మిశ్రాదే అని ప్ర‌తిప‌క్షాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఆయ‌న రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. పార్ల‌మెంటులో చ‌ర్చించాల‌ని విప‌క్షాలు పట్టుబ‌డుతున్నాయి.

English summary
Union Minister Ajay Mishra is a big criminal - Rahul Gandhi fire,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X