కేంద్రమంత్రిపై ఇటుకలతో దాడి: స్వల్ప గాయాలు!
పశ్చిమబెంగాల్: కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి బాబుల్ సుప్రియోపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇటుకరాళ్లతో దాడి చేశారు. అసన్సోల్ ప్రాంతంలోని ఓ పోలీస్‌స్టేషన్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుండగా ఈ దాడి జరిగింది.

పలువురు బీజేపీ కార్యకర్తలను విడిపించేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తుండగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి తన కారు అద్దాలను ధ్వంసం చేశారని కేంద్ర మంత్రి సుప్రియో తెలిపారు. తన ముందు నల్లజెండాలు ప్రదర్శించారని చెప్పారు.
అయితే, తన కారు వద్దకు పోలీసులు వారిని తన కారు వద్దకు ఎలా అనుమతించారని ఆయన ప్రశ్నించారు. దాడిలో కేంద్రమంత్రి గాయపడ్డట్లు సీసీ ఫుటేజీల్లో స్పష్టంగా నమోదైందని అక్కడున్న బీజేపీ నాయకులు తెలిపారు.












Click it and Unblock the Notifications