
ఉక్రెయిన్‌లో సవాళ్లు ఎదుర్కొన్నాం : 22 వేల మందికిపైగా భారతీయులు స్వదేశానికి..! ; పార్లమెంటులో జైశంకర్
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధ సంక్షోభం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారతీయల తరలింపు అంత్యంత క్లిష్టంగా సాగిందని విదేశాంగ శాఖమంత్రి ఎస్ జై శంకర్ పేర్కొన్నారు. అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ .. ఉక్రెయిన్ నుంచి 22,500 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు ఆయన రాజ్యసభలో వెల్లడించారు. విద్యార్థుల కోసం "ఆపరేషన్ గంగ"ను కేంద్రం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కింద 90 విమానాలను నడిపినట్లు చెప్పారు. తీవ్ర యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పటికీ తమ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విజయంతం చేసిందని చెప్పారు.

విద్యార్థుల తరలింపు క్లిష్టంగా..
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ పలుమార్లు మాట్లాడారు. అటు ఈయూ దేశాల ప్రధానులతోనూ మోదీ మాట్లడడంతో భారతీయుల తరలింపు సాధ్యమైందని జైశంకర్ పేర్కొన్నారు. భారతీయ విద్యార్థుల తరలింపుకు సహకరించిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. సుమీ నగరం నుంచి విద్యార్దుల తరలింపు అత్యంత క్లిష్టంగా మారిందని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ రాయబారులతో మన విదేశాంగ శాఖ కార్యదర్శి అనునిత్యం సంప్రదింపులు జరిపారని పేర్కొన్నారు.

సమస్యలు తలెత్తినా..
అటు మన కేంద్ర మంత్రులు ఈయూ దేశాలకు వెళ్లడం వలన.. విద్యార్థుల తరలింపు చాలా సులభతరమైందని సభలో జై శంకర్ చెప్పారు. కీవ్, ఖర్కిన్, సుమీ నగరాల నుంచి భారతీయులను తరలించినట్లు తెలిపారు. విపత్కర పరిస్థితులు ఎదువతున్నప్పటికీ వారిని బస్సులు, రైళ్లలో సరిహద్దు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు తరలించినట్లు వెల్లడించారు. ఎప్పటికప్పుడు ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ విద్యార్థులతో టచ్ లో ఉన్నట్లు తెలిపారు. పాస్ పోర్టు సమస్యలు తలెత్తకుండాచర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
Recommended Video

నవీన్ భౌతికాయాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగిన సయమంలో సుమారు 20 వేల మంది విద్యార్థుల పరిస్థితి ప్రమాదంలో పడిందని సభలో జైశంకర్ వివరించారు. వాటన్నింటిని ఎదుర్కొని భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు తెలిపారు. రష్యా దాడిలో ఖార్కీవ్‌లో మెడికల్ చదువుతున్న విద్యార్థి నవీన్ శేఖరప్ప చనిపోయారని తెలిపారు. నవీవ్ మృతి పట్ల జైశంకర్ నివాళల్పిచారు. ఉక్రెయిన్ నుంచి నవీన్ భౌతికాయాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అటు బుల్లెట్ గాయాలైన హర్ జ్యోత్ సింగ్ కు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ అధికారుల సహకారం ఎనలేదనని వారికి కృతజ్ఞతలు తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని , శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు.