గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి కింజరాపు: మోదీ గ్రీన్ సిగ్నల్..!!

Kinjarapu Rammohan Naidu: పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విమాన ప్రయాణికులకు తీపి కబురు ఇచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో కూడా ఉడాన్ యాత్రీ కేఫ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ప్రకటించారు.

విమాన ప్రయాణికల కోసం ఆహార పదార్థాలు, తినుబండారాలు, మంచినీళ్లు, టీ, కాఫీ, స్నాక్స్.. వంటివి ఇందులో అతి తక్కువ ధరలో విక్రయించడానికి ఉద్దేశించిన కేఫ్‌లు ఇవి. దశలవారీగా దేశంలోని అన్ని ఎయిర్‌పోర్ట్‌లల్లో వీటిని ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ప్రధామంత్రి నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారని అన్నారు.

Union Minister Kinjarapu Rammohan Naidu announced Udaan Yatri Cafe in all airports

పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ ఉడాన్ యాత్రి తొలి కేఫ్‌ కోల్‌కతలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటైంది. ఈ మధ్యాహ్నం దీన్ని కింజరాపు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ ఎయిర్‌పోర్ట్ ప్రారంభమై వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కొత్తగా లోగోను సైతం కేంద్రమంత్రి ఆవిష్కరించారు. 1924లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం దీన్ని నెలకొల్పింది.

ఢిల్లీ రాజీవ్ గాంధీ భవన్‌లో భవన్‌లో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విమానాశ్రయాల్లో ఆహార పదార్థాలు, టీ, కాఫీ, ఇతర స్నాక్స్ అధిక రేటుకు విక్రయిస్తోన్నారంటూ ప్రయాణకుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగా ఈ ఉడాన్ యాత్రి కేఫ్ కాన్సెప్ట్‌ను తెర మీదికి తీసుకొచ్చామని కింజరాపు వివరించారు.

అందుబాటులో ఉండే ధరలతో ఈ కేఫ్‌లల్లో ఆహార పదార్థాలు లభిస్తాయని చెప్పారు. విమానాశ్రయాల్లో డిపార్చర్ పాయింట్ల వద్ద ఈ కేఫ్‌లు ఏర్పాటవుతాయని అన్నారు. వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఎయిర్‌పోర్ట్‌ను ముద్రించిన ప్రత్యేక పోస్టల్ స్టాంప్, నాణేలను ఈ నెల 21వ తేదీన విడుదల చేస్తామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

ఈ ఎయిర్‌పోర్ట్‌ను మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను రూపొందించాలంటూ అధికారులను ఆదేశించానని అన్నారు. కోల్‌కత ఎయిర్‌పోర్ట్ శతాబ్ది ఉత్సవాలను మూడు నెలలపాటు నిర్వహిస్తామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. మెట్రో నగరాలతో పాటు ఓ మోస్తరు నగరాలకూ విమానాశ్రయాలను విస్తరించాలనేది ప్రధాని మోదీ సంకల్పమని, అందులో భాగంగానే ఉడాన్ పథకాన్ని అమలు చేస్తోన్నామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+