Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'మి టు'పై కేంద్రం స్పందన, రిటైర్డ్ జడ్జిలతో కమిటీ: స్పందించిన మేనకాగాంధీ

న్యూఢిల్లీ: 'మి టూ' వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు స్పందించింది. ఈ ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో ప్రత్యేక ప్యానల్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ఆరోపణలపై నలుగురు రిటైర్డ్ జడ్జిలతో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు కానుంది.

'మి టూ' ఉద్యమంపై కేంద్రమంత్రి మేనకా గాంధీ స్పందించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిస్తామని తెలిపారు. వారిని (మి టూ అంటూ ఆరోపణలు చేస్తున్న మహిళలు) అందరిని తాను విశ్వసిస్తున్నానని, అందులోని ప్రతి ఒక్కరి బాధను తాను గుర్తించానని అన్నారు.

Union minister Maneka Gandhi proposes 4 member panel to look into MeToo cases

ఈ కారణంగానే సీనియర్ జ్యుడిషియల్, లీగల్ పర్సన్స్‌తో తాను ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు. మహిళలపై వేధింపుల అంశాన్ని ఉపేక్షించేది లేదని చెప్పారు. దీనిపై చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. తాను ఏర్పాటు చేసిన కమిటీతో ఈ ఉద్యమంలోని కేసులపై విచారణ జరిపిస్తామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+