వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్: హోంక్వారంటైన్లో ప్రహ్లాద్ జోషి

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మరో కేంద్రమంత్రి కరోనా బారినపడ్డారు. కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి కరోనా సోకింది. బుధవారం కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

నేను కరోనా బారినపడ్డాను. తాజా చేయించుకున్న పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నాకు ఎలాంటి లక్షణాలూ లేవు. వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్లో ఉన్నా అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, కోల్, మైన్స్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

 Union Minister Pralhad Joshi Tests Positive For COVID-19

ధర్వాడ్ లోక్ సభ స్థానం నుంచి ప్రహ్లాద్ జోషి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగానూ ఉన్న జోషీ.. ఇటీవల జరిగిన సమావేశాల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.

కాగా, కర్ణాటకకు చెందిన మరో కేంద్రమంత్రి సురేష్ అంగడి కరోనా బారినపడి మరణించిన విషయం తెలిసిందే. ఈయనతోపాటు బీజేపీ రాజ్యసభ ఎంపీ అశోక్ గస్తి, బసవకళ్యాణ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీ నారాయణ రావు కూడా కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కూడా కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్దరామయ్యతోపాటు పలువురు మంత్రులు కూడా కరోనా బారినపడ్డారు.

కర్ణాటకలో కరోనా కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,68,652 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,16,153 యాక్టివ్ కేసులున్నాయి. 5,42,906 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 9,574 మంది కరోనా బారినపడి మరణించారు.

English summary
Union Minister of Parliamentary Affairs, Coal and Mines Pralhad Joshi on Wednesday said he has tested positive for COVID-19 and was under home quarantine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X