Indian railways: రైళ్ళలో ప్రయాణించే ప్రతీ ప్రయాణికుడికి సబ్సిడీ!
రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం భారీ మొత్తంలో సబ్సిడీ అందిస్తుంది. ప్రతి సంవత్సరం రైల్వే శాఖ ద్వారా రైల్వే టికెట్ల పైన 47% సబ్సిడీ ఇస్తుంది. ప్రయాణికుల నుంచి కేవలం 53% డబ్బులు మాత్రమే వసూలు చేస్తుంది. అయితే ఇటీవల భారతీయ రైల్వే ఆదాయాన్ని పెంచుకునే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న క్రమంలో ప్రయాణికులు రైల్వే టికెట్లపై సబ్సిడీని వదులుకోవాలని కోరుతోంది.
రైల్వే టికెట్స్ పై సబ్సిడీ వదులుకోవాలంటే గివ్ ఇట్ అప్
ఎవరైనా టికెట్ లపై సబ్సిడీ వద్దని భావిస్తే వారు గ్యాస్ సిలిండర్ ల పైన సబ్సిడీ మాదిరిగా రైల్వే టికెట్ల పైన కూడా సబ్సిడీని వదులుకోవచ్చని పేర్కొంది.దీనికోసం గివ్ ఇట్ అప్ పథకాన్ని తీసుకువచ్చింది. సబ్సిడీని వదులుకునే వారు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి రైల్వే టికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

సబ్సిడీ వదులుకునేందుకు మోదీ పిలుపు
ఇక రైల్వే నివేదికల ప్రకారం భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం టికెట్లను విక్రయించడం ద్వారా 60 వేల కోట్ల ఆదాయాన్ని పొందుతుంది. గివ్ ఇట్ అప్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా సబ్సిడీ వదులుకునే వారితో సుమారు పదివేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్టు రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు . ఈ క్రమంలోనే ప్రధాని మోదీ పిలుపుతో చాలామంది రైల్వే సబ్సిడీని వదులుకుంటున్నారు.
సబ్సిడీపై పార్లమెంట్ లో కేంద్ర రైల్వే మంత్రి
ఇక ఈ క్రమంలో తాజాగా పార్లమెంటు సమావేశాలలో క్రీడాకారులకు ఇచ్చే రైల్వే సబ్సిడీ పైన అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. రైల్వే ప్రతి ప్రయాణికుడి ప్రయాణానికి సబ్సిడీ ఇవ్వాలని భావిస్తుందని పేర్కొన్నారు. కేంద్రం ఇస్తున్న పూర్తి సబ్సిడీలో దేశవ్యాప్తంగా అందరి ప్రయాణికులకు సౌకర్యాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. అయితే ప్రత్యేకించి క్రీడాకారులకు వేరే సబ్సిడీ లేదని కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానంతో చెప్పకనే చెప్పారు.
రైల్వేకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన రైల్వే మంత్రి
ఇక ఇదే సమయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైలు పట్టాలని ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తున్నామని రైల్వే మంత్రి పేర్కొన్నారు. ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ కవచ్ అభివృద్ధి పూర్తయిందని ప్రయాణికుల రక్షణ కోసం కూడా రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు సమాధానం గా తెలిపారు.












Click it and Unblock the Notifications