సమైక్యాంధ్ర పోరు: బాదల్‌తో వైయస్ జగన్ భేటీ

న్యూఢిల్లీ: సమైక్యాంధ్రకు మద్దతుగా, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టే క్రమంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ శుక్రవారం ఉదయం పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌ను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సహకారం అందించాలని ఆయన బాదల్‌ను కోరారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీర్మానం లేకుండానే విభజన ప్రక్రియను ముందుకు తీసుకుని వెళ్తున్న వైనాన్ని ఆయన తెలిపారు. ఆర్టికల్ 3 సవరణ కోసం చేస్తున్న ఉద్యమానికి కలిసి రావాలని కూడా ఆయన కోరారు. ఇలాంటి విభజనలు పునరావృతం కాకుండా ఆర్టికల్ 3 సవరణ కోసం ముందుకు రావాలని ఆయన అన్నారు.

United Andhra compaign: Jagan meets Badal

ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో జగన్‌తో పాటు పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్వీందర్ బాదల్ పాల్గొన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతినిధుల బృందంలో పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, నాయకులు మైసురా రెడ్డి, బాలశౌరి సమావేశంలో పాల్గొన్నారు.

శుక్రవారం సాయంత్రం వైయస్ జగన్ పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కలుస్తారు. రేపు శనివారం ఆయన డిఎంకె నేత రాజాను కలుస్తారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+