చెన్నై జలమయం: పరీక్షలు వాయిదా, కమల్ వార్నింగ్, చెన్నై చెరువులు నిండిపోయాయి, గండి !

Posted By:
Subscribe to Oneindia Telugu
  చెన్నైలో ఇళ్లలోకి వరద నీరు (Video) | Oneindia Telugu

  చెన్నై: తమిళనాడులో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది. తమిళనాడులోని మూడు యూనివర్శిటీలు, పాఠశాలల్లో ఈ వారం, వచ్చే, వారం నిర్వహించాల్సిన పరీక్ష్లలు వాయిదా వేస్తున్నామని తమిళనాడు విద్యా శాఖ అధికారులు శుక్రవారం ప్రకటించారు.

  పన్నీర్ సెల్వం ఇంటిలోకి వరద నీరు: సీఎం ఇంటి రోడ్డులో ఐదు అడుగుల ఎత్తు నీరు, అంతే !

  చెన్నై నగరంతో పాటు దక్షిణ తమిళనాడులోని సముద్రతీర ప్రాంతాల్లోని జిల్లాల్లో కొంత కాలంగా భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. రోడ్లు మీద వర్షం నీరు అడుగుల ఎత్తులో నిలిచిపోవడంతో విద్యార్థులు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురైనాయి. ఈ సందర్బంలోనే తమిళనాడులో వచ్చే వారం నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా వెయ్యలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

  20 వేల ఇళ్లలోకి వరద నీరు

  20 వేల ఇళ్లలోకి వరద నీరు

  చెన్నై, నగర శివార్లలోని 20 వేళ ఇళ్లలోకి వరద నీరు చేరినట్లు అధికార వర్గాల గణాంకాలు తేల్చాయి. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటిలోని వరద నీటిని బయటకు పంపించడానికి నానా తిప్పులు పడుతున్నారు. రాత్రి అయితే మళ్లీ వర్షం పడటం, వరద నీరు మళ్లీ ఇళ్లల్లోకి రావడంతో ముప్పు తిప్పలు పడుతున్నారు.

  ద్రోణి వాయుగుండం ?

  ద్రోణి వాయుగుండం ?

  ప్రస్తుతం దక్షిణ తమిళనాడు వైపుగా వర్షం మళ్లినట్లు పరిస్థితి నెలకొంది. బంగాళఖాతంలో ద్రోణి ఏర్పడటం వలనే వర్షం దక్షిణ తమిళనాడు వైపు మళ్లిందని తెలిసింది. శ్రీలంక సమీపంలో ఏర్పడిన ద్రోణి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

  ముప్పు తప్పదంటున్న కమల్ హాసన్

  ముప్పు తప్పదంటున్న కమల్ హాసన్

  చెన్నైకి మళ్లీ వరద ముప్పు తప్పదని బహుబాష నటుడు కమల్ హాసన్ హెచ్చరించారు. దక్షిణ చెన్నైలోని చెరువులు అన్నీ నిండిపోయాయని, పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని కమల్ హాసన్ చెప్పారు. రోడ్లు, ఇళ్లలో ఉన్న వరద నీటిని తొలగించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని కమల్ హాసన్ మండిపడ్డారు.

   చెరువులకు గండి

  చెరువులకు గండి

  చెన్నై శివారు ప్రాంతాల్లో ని అన్ని చెరువులు నిండిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం రాత్రి భారీ వర్షాలు పడితే చెరువులకు పూర్తి స్థాయి గండికొట్టాలని పరిసరవాసులు సిద్దం అవుతుండటంతో అడయార్ తీరంలో ఉత్కంఠనెలకొంది.

   ప్రభుత్వం పూర్తిగా విఫలం

  ప్రభుత్వం పూర్తిగా విఫలం

  చెన్నై నగరంలో వరద నివారణ చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్, తమిళమానిల కాంగ్రెస్ నేత జీకే. వాసన్, సీపీఐ నేత ముత్తరసన్ మండిపడ్డారు. మంత్రులు పైకి మాత్రం మాటలు చెబుతున్నారని, ప్రజల కష్టాలు పట్టించుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  At least three universities and many schools have postponed exams slated for this week and next week due to the heavy rains that have been lashing Chennai and other parts of the state.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి