చంపుతామంటూ నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్: దావూద్ పేరుతో!
ముంబై: కేంద్ర రవాణా శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీకి చంపుతామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపులు వచ్చాయి. నాగ్‌పూర్‌లోని గడ్కరీ కార్యాలయానికి కాల్ చేసిన దుండగులు.. గడ్కరీని చంపుతామని, ఆయన కార్యాలయాన్ని పేల్చేస్తామని బెదరించారు.
నాగ్‌పూర్‌లోని కేంద్రమంత్రి కార్యాలయంలోని ల్యాండ్‌లైన్ నెంబర్‌కు రెండుసార్లు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ పేరుతో బెదిరింపులు వచ్చాయన్నారు. గడ్కరీ కార్యాలయానికి ఫోన్ చేసిన దుండగులు.. 100 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. డబ్బులు ఇవ్వనందుకు చంపేస్తామని బెదిరించినట్లు తెలుస్తోంది.

బెదిరింపు కాల్స్ వచ్చిన వెంటనే గడ్కరీ నాగ్‌పూర్ కార్యాలయానికి భద్రతను పెంచారు. శనివారం ఉదయం నుంచి రెండుసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని పోలీసులు తెలిపారు. నేటి ఉదయం 11.30గంటలకు ఒకసారి, రెండోసారి 11.40కి మరోసారి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే నాగ్‌పూర్ పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించారు.
Maharashtra | Union Minister Nitin Gadkari's office in Nagpur received two threatening calls this morning. Nagpur Police say that further investigation is going on.
— ANI (@ANI) January 14, 2023
Visuals from outside the Minister's office. pic.twitter.com/BMgcANvUOO
స్థానిక పోలీసులతోపాటు యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) బృందం గడ్కరీ కార్యాలయానికి చేరుకుంది. దీనికి సంబంధించిన ఏటీఎస్ బృందం వివరాలను సేకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications