కిరాకతం: నాలుక, మర్మాంగం కోసి పైశాచిక దాడి, వివాహేతర సంబంధమే కారణమా

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగుళూరు: మూత్ర విసర్జనకు బయటకు వచ్చిన బిజూనాయక్ అనే వడ్రంగిపై గుర్తు తెలియని వ్యక్తులు పైశాచికంగా దాడి చేశారు. అతని నాలుక, మర్మాంగాన్ని కోసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరించారు. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బెంగుళూరు వైట్ ఫీల్డ్ పోలీసుల కథనం మేరకు ఇమ్మడిహళ్ళిలో నిర్మాణంలో ఉన్న భవనంలో ఒడిశాకు చెందిన బిజా నాయక్ వడ్రంగిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.ఆయన అక్కడే నివాసం ఉంటున్నాడు.

unknown persons slashes carpenter bijnaik's tongue and private parts

శుక్రవారం రాత్రి ముత్రవిసర్జన కోసం బయటకు వచ్చాడు. అయితే అక్కడే కాపు కాసిన నలుగురు ఆగంతకులు బిజూనాయక్ పై దాడి చేశారు. అతని నాలుక, మర్మాంగాలను కత్తితో కోసేశారు.

తమకు గుర్తించకుండా ఆగంతకులు ముసుగులు ధరించారని బాధితుడు పోలీసులకు రాతపూర్వకంగా చెప్పారు. బాదితుడిని ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అయితే ఈ ఘటనకు కారణాలేమిటనే విషయం ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. పాతకక్షలు లేదా వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే స్నేహితులే బిజూపై దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
unknown persons slashes carpenter bijnaik's tongue and private parts in banglore on friday night.
Please Wait while comments are loading...