ట్విస్ట్: బెంగళూరులో 10వ అంతస్తు నుంచి దూకి లేడీ టెక్కీ ఆత్మహత్య, గోవాలో బలవంతంగా !
బెంగళూరు నగరంలో ఉద్యోగం చేస్తున్న కార్యాలయంలోని 10వ అంతస్తు నుంచి కిందకుదూకి ఆత్మహత్య చేసుకున్న లేడీ టెక్కీ గితాంజలి (27) ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. సాఫ్ట్ వేర్ ఇంజనీరు గీతాంజలి ఆత
బెంగళూరు: బెంగళూరు నగరంలో ఉద్యోగం చేస్తున్న కార్యాలయంలోని 10వ అంతస్తు నుంచి కిందకుదూకి ఆత్మహత్య చేసుకున్న లేడీ టెక్కీ గితాంజలి (27) ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. సాఫ్ట్ వేర్ ఇంజనీరు గీతాంజలి ఆత్మహత్య కేసులో బెంగళూరు పోలీసులు పలు ఆధారాలు సేకరించారు.
బెంగళూరులోని కాడుబీసనహళ్ళిలోని సెస్నా బిజినెస్ పార్క్ లోని అలోఫ్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న గీతాంజలి బుధవారం అదే కార్యాలయం 10వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. గోవాలో నివాసం ఉంటున్న గీతాంజలి కుటుంబ సభ్యులు బెంగళూరు చేరుకున్నారు.

గీతాంజలి కుటుంబ సభ్యులను పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు. నవంబర్ 21వ తేదీ (మంగళవారం) గీతాంజలి పుట్టిన రోజు. పుట్టిన రోజు కుటుంబ సభ్యులతో జరుపుకోవడానికి నాలుగు రోజుల క్రితం గీతాంజలి గోవాకు వెళ్లింది.
పుట్టిన రోజు జరుపుకోవాలని గోవాలోని ఇంటికి వెళ్లిన గీతాంజలికి ఆమె కుటుంబ సభ్యులు షాక్ ఇచ్చారు.
గీతాంజలికి అప్పటికే పెళ్లి సంబంధం చూసి నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గీతాంజలి పుట్టిన రోజు ఆమెను బలవంతంగా ఒప్పించి నిశ్చితార్థం జరిపించారు. మరుసటి రోజు బెంగళూరు వచ్చిన గీతాంజలి ఇష్టంలేని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడేకంటే ఒక్క రోజులో చనిపోవడం మంచిదని 10వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications