H-Files: వాదనలు, ఆరోపణలన్నీ తప్పుల తడకే
హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో పెద్ద ఎత్తున ఓట్ చోరీ జరిగిందంటూ రాహుల్ గాంధీ ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశం కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఓ రాజకీయ కుట్రను బయటపెట్టినట్టయింది. ఆయన చేసిన ఆరోపణలను పరిశీలిస్తే, ఎన్నికల అవకతవకలకు సంబంధించిన ఆధారాలు కాకుండా, పకడ్బందీగా రూపొందించిన ఓ తప్పుడు ప్రచారం బయటపడింది. "హెచ్-ఫైల్స్"గా పేర్కొన్న ఆరోపణలన్నీ అవాస్తవాలుగా తేలాయి.
ఇది కాంగ్రెస్ సొంతంగా రూపొందించిన మోసం, పక్షపాత వాదనలుగా నిపుణులు విశ్లేషించారు. ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను వక్రీకరించినట్లు చెబుతున్నారు. మల్టీ ఓటింగ్, ఎగ్జిట్ పోల్స్, బ్యాలెట్ పేపర్లు, బ్రెజిలియన్ మోడల్ ఫోటో.. వంటి ఆయన వాదనలన్నీ కూడా తప్పుడు సమాచారం, వాస్తవాల వక్రీకరణలపై ఆధారపడి ఉన్నాయని, వాటికి మద్దతు ఇచ్చే ఆధారాలు లేవని రాజకీయ పండితులు అంచనా వేశారు.

హర్యానాలోని ధకోలా పోలింగ్ బూత్‌లో ఒకే రకమైన ఓటర్ల రిజిస్ట్రేషన్లు 220 ఉన్నాయని, ఇది నకిలీ ఓట్ల అద్దం పట్టిందని రాహుల్ గాంధీ ప్రకటించారు. "ఆమె పేరు మాకు తెలియదు, ఆమె వయస్సు మాకు తెలియదు, కానీ ఆమె రెండు బూత్‌లలో 223 సార్లు కనిపించింది. లోక్‌సభ ఎన్నికల్లో, ఆమె ఒక బూత్‌లో 223 సార్లు ఆమె పేరు ఓటరు జాబితాలో రికార్డయింది. ఆపై ఎన్నికల సిబ్బంది దాన్ని రెండు బూత్‌లుగా విభజించాలని నిర్ణయించుకున్నారు" అని అన్నారు.
ధకోలా గ్రామంలోని బూత్ నంబర్ 63 గురించి ఆయన ప్రస్తావించారు. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం, ఆ బూత్‌ను 63, 64 బూత్ నంబర్లుగా విభజించారు. 2019లో, బూత్ 63 ధకోలాను సూచించగా, 64 రాంపూర్‌ను సూచించింది. 2024లో, రాంపూర్ ఓట్లను 65వ బూత్ నుండి కేటాయించారు. ధకోలా స్వయంగా పరిపాలనా సౌలభ్యం కోసం రెండు వేర్వేరు బూత్‌లుగా విభజించారు. పోలింగ్ బూత్‌లోని ఓటర్ల సంఖ్య నిర్ణీత పరిమితిని దాటినప్పుడు ఎన్నికల సంఘం అనుసరించే ఓ సాధారణ ప్రక్రియ ఇది.
వాస్తవానికి పోలింగ్ బూత్ సరిహద్దులను సాధారణంగా పునర్విభజించడం దేశం అంతటా ప్రతి ప్రధాన ఎన్నికలకు ముందు జరుగుతుంది. దీన్ని రాహుల్ గాంధీ తనకు అనుకూంగా మలచుకున్నారు. ధకోలాలో కాంగ్రెస్‌కే మెజారిటీ వచ్చిన ఎన్నికలు ఉన్నాయి. 2019, 2024 మధ్య, కాంగ్రెస్ ఆ ప్రాంతంలో తన ఓట్ల వాటాను గణనీయంగా మెరుగుపరుచుకుంది. బీజేపీ కంటే ఎక్కువ ఓట్లను సాధించింది.
2024 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ధకోలా కాంగ్రెస్‌కు నిర్ణయాత్మకంగా ఓటు వేసింది. బీజేపీ ఓట్ల వాటా దాదాపు సగానికి తగ్గింది. రిగ్గింగ్ జరిగిందంటూ రాహుల్ గాంధీ ఏ బూత్ పై ఆరోపణలు చేశారో.. అదే బూత్ లో కాంగ్రెస్ కు మెజారిటీ వచ్చింది. బీజేపీ ఎన్నికల వ్యవస్థను తారుమారు చేసిందని ఆరోపించడం తర్కానికి విరుద్ధం. ఆయన వాదన నాటకీయ అసంబద్ధతను బయటపెట్టినట్టయింది.

రాహుల్ గాంధీ రెండవ వాదన ఎగ్జిట్ పోల్స్‌ను చుట్టూ తిరిగింది. కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందని సూచించిన ఎగ్జిట్ పోల్స్‌ను ఆయన ఉదాహరణగా చూపించారు. తుది ఫలితాలు తారుమారు అయ్యాయని ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ కూడా ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు లోబడే ఉంటాయి. బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పుడు ఈ పోల్స్‌ను నమ్మదగనివిగా లేదా ప్రచారం సాధనాలుగా రాహుల్ గాంధీ ఓ దశాబ్దం పాటు కొట్టిపారేశారు.
2014, 2019, 2024 ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ వచ్చినట్టు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ను ఆయన కొట్టిపారేశారు. వాటిపై సెటైర్లు వేశారు. హర్యానాలో కొన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినప్పుడు.. రాహుల్ గాంధీ యూటర్న్ తీసుకున్నారు. వాటి పట్ల విశ్వసనీయతను ప్రదర్శించారు. తనకు సౌకర్యంగా ఉన్నప్పుడు డేటాను అంగీకరించడం, లేనప్పుడు తిరస్కరించడం అనే ద్వంద్వనీతిని రాహుల్ గాంధీ అనుసరించినట్టయింది.
మూడో ఆరోపణ.. బ్యాలెట్ పేపర్లకు సంబంధించినది, ఈ విషయాన్ని రాహుల్ గాంధీ పూర్తిగా వక్రీకరించారు. పోస్టల్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందని.. తుది ఫలితాల్లో ఓడిపోయిందని, ఇది మోసానికి ప్రతీకగా ఆరోపించారు. హర్యానాలో మొత్తం ఓట్లలో కేవలం 0.57 శాతం మాత్రమే అనేది ఆయన విస్మరించారు. ఈ స్వల్ప పరిమాణాన్ని ఆధారంగా చేసుకుని పెద్ద ఎత్తున తారుమారు చేసినట్లు సాక్ష్యంగా మార్చడం ఆయన ఆరోపణల డొల్లతనాన్ని సూచిస్తోంది.
ఒక శాతం కంటే తక్కువ ఓట్లను చూపించడం ద్వారా ఈవీఎంలల్లో వేసిన 99.43 శాతం ఓట్లను విస్మరించడం రాహుల్ గాంధీ అసంబద్ధ వాదనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎన్నికల విశ్లేషకులు చాలా కాలంగా గమనించిన విషయం ఏమిటంటే, బ్యాలెట్ లీడ్‌లు తుది ఫలితాలను అరుదుగా ప్రతిబింబిస్తాయి. 2015 బీహార్ నుండి స్పష్టంగా ఉంది. ఇక్కడ పోస్టల్ ఓట్ల లెక్కింపుతో పోల్చుకుంటే ఈవీఎంల ద్వారా వెలువడిన ఫలితాలు మారిపోయాయి.

ఎన్నికల సంఘం నుండి వచ్చిన డేటా నాలుగు నియోజకవర్గాలు- జులానా, హథిన్, నాంగల్ చౌదరి, అదంపూర్ - బీజేపీ పోస్టల్ బ్యాలెట్లలో ఆధిక్యంలో ఉన్నప్పటికీ తుది లెక్కింపులో ఓడిపోయిందని చూపించింది. అదే సమయంలో 2024 అక్టోబర్ లో నాయబ్ సైనీ విలేకరుల సమావేశం నుండి కట్ చేసిన క్లిప్‌ను ప్రచారం చేశారు. గెలవడానికి తమ వద్ద అన్ని ఏర్పాట్లు ఉన్నాయని అని చెప్పడం కనిపించింది. ఇది ఓట్ చోరీకి నిదర్శనమని రాహుల్ చెప్పడం అసంబద్ధం.
నిజానికి సైనీ మాట్లాడింది పొత్తుల గురించి. తమకు ఎటువంటి పొత్తు అవసరం లేదని, ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఈ విషయంలో తమకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయని అన్నారు. అంతే గానీ ఆ ఏర్పాటు అనేది రిగ్గింగ్ గురించి కాదు. ఈ ఆరోపణలను సీఎం సైనీ తరువాత ఖండించారు కూడా.
రాహుల్ గాంధీ మొత్తం 22,779 ఓట్ల తేడాతో ఎనిమిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు వచ్చిన తక్కువ ఓట్ల గురించి ఎత్తి చూపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.18 లక్షల ఓట్ల అంతరం వ్యవస్థాగత దొంగతనాన్ని నిరూపించిందని పేర్కొన్నారు. ప్రాథమిక ఎన్నికలు దీన్ని బట్టబయలు చేశాయి. హర్యానాలో 10 టఫ్ ఫైట్ లల్లో కాంగ్రెస్ ఆరు గెలిచింది. బీజేపీ మూడింట్లో నెగ్గింది.
రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో ఒకటి బ్రెజిలియన్ మోడల్ ఫోటోను హర్యానాలో అనేక ఓటరు ఐడి కార్డులపై ఉపయోగించారనేది. ఆ మోడల్ లారిస్సా నెరీగా తేలింది. ఆమె బ్రెజిల్ నుండి వచ్చిన డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్. దీనిపై ఆమె స్పందించారు కూడా. రాహుల్ గాంధీ ఆరోపణలను బహిరంగంగా ఖండించారు. అయినప్పటికీ, కాంగ్రెస్ నాయకులు తమ ఆన్‌లైన్ పోస్ట్‌లలో ఆమె ఫోటోను ఉపయోగించడం కొనసాగించారు.

రాహుల్ గాంధీ ఆరోపణలు వాస్తవానికి డొల్లే. సందర్భోచితంగా వక్రీకరించారు. కల్పితాలను వాస్తవాలుగా చిత్రీకరించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ప్రతి ఆరోపణ కూడా విశ్లేషణలో తేలిపోతుంది. ఎన్నికల ఓటమిని గౌరవంగా అంగీకరించడానికి బదులుగా కల్పిత ఆవేశం, ఉద్దేశపూర్వక తప్పుదారి పట్టించడం, కుట్ర పూరక ప్రచారం మార్గాన్ని రాహుల్ గాంధీ ఎంచుకున్నారు. హర్యానా ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రతి విధానపరమైన నిబంధనకు పూర్తిగా అనుగుణంగా జరిగాయి.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications