కళ్లముందే ఉగ్రమూకలు.. ఒళ్లంతా రక్తంతో ఛిద్రం అయినా.. రోమాలు నిక్కపొడిచే వీడియో భయ్యా
కళ్లముందే ఉగ్రమూకలు దాడి చేస్తున్నాయి. అభం శుభం తెలియని ఆ పర్యాటకులను కాల్చి చంపేస్తున్నాయి. ఏం జరుగుతుందో అని తెలిసేలోపే టూరిస్టులు పిట్టల్లా రాలిపోతున్నారు. చిన్నా పెద్దా అని చూడకుండా ఉగ్రవాదులు మారణహోమం సృష్టిస్తున్నారు. ఈ మారణకాండలో ఓ పిల్లాడి ఏడుపు.. ఆర్తనాదాలు.. ఓ వైపు బుల్లెట్ల సౌండ్.. మరోవైపు దిక్కుతోచని స్థితిలో ఆ చిన్నారి ఆర్తనాదాలు. ఇదీ అప్పటివరకు అక్కడి పరిస్థితి.
టెర్రరిస్టులు జరిగిన ఉగ్రదాడిలో గాయాలపాలై దిక్కుతోచని స్థితిలో రోదిస్తున్న ఆ బాలుడికి దేవుడిలా చేయి అందించాడు ఓ కశ్మీరీ యువకుడు. గాయపడ్డ బాలుడ్ని భుజాలపై వేసుకోని కిలోమీటర్లు అలాగే పరిగెత్తి ప్రాణాలు కాపాడాడు. మరి కొద్ది సేపు అక్కడే ఉంటే ప్రాణాలు కోల్పోయే ఆ బాలుడికి పునర్జన్మ ఇచ్చాడు ఆ కాశ్మీరీ యువకుడు. మనుషుల్లో మానవత్యం ఇంకా మిగిలే ఉంది అని అనడానికి ఈ దృశ్యాలే సజీవ సాక్ష్యం.

కాశ్మీర్ కు చెందిన ఓ యువకుడు బాలుడ్ని ప్రాణాలకు తెగించి కాపాడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఓ వైపు రాక్షస మూకలు ప్రజల ప్రాణాలు తీస్తుంటే.. ఓ భారతీయ యువకుడిగా వాళ్లకు ఎదురొడ్డి బాలుడి ప్రాణాలు కాపాడాడా ఆ యువకుడు. ఈ క్రమంలో అందరూ అతడికి సెల్యూట్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తుంటే రోమాలు నిక్కపొడుస్తాయి ఎవరికైనా. బహూశా ఇలాంటి వీడియో మీరు ఇంతకు మందు ఎప్పుడూ చూసి ఉండరేమో అనిపిస్తుంది.
In the face of terror, humanity spoke louder. A Kashmiri risking his life to rescue an injured tourist boy — this is the real Kashmir. Not defined by violence, but by compassion, courage and love. Let the world see who we truly are..#PahalgamTerroristAttack… pic.twitter.com/16PkuPtVuQ
— Inam Un Nabi انعام النبی (@inamnabi) April 23, 2025
ఈ సాహసోపేతమైన దృశ్యాలను ఎక్స్ ఖాతాలో ఇనమా ఉన్ నబీ అనే వ్యక్తి షేర్ చేశారు. ఓవైపు ఉగ్రదాడి జరుగుతుంటే.. అంతకుమించిన మానవత్వం ప్రదర్శించాడు ఓ కాశ్మీరీ యువకుడు. ప్రాణాలు పణంగా పెట్టి గాయపడ్డ ఓ టూరిస్ట్ బాలుడ్ని కాపాడాడు. ఇది రియర్ కాశ్మీర్ అంటే. దేశం కోసం ప్రాణాలు ఇస్తాం. అని భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో భారతీయుల హృదయాలను కలచివేస్తోంది. ఎంతైనా ఈ యువకుడి చేసిన పనికి సెల్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.
ఇక మంగళవారం జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 28 మంది టూరిస్టులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇదో పిరికిపంద చర్యగా అభివర్ణించాయి. అటు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. త్వరలోనే ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా ఉగ్రమూకలకు బదులు చెప్తామని అన్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications