వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు అస్వస్థత: ఉచిత మంచినీళ్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : రెండు రోజల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధథధ్యల చేపట్టిన కేజ్రీవాల్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం కార్యాలయానికి హాజరుకాలేకపోయారు, ఆయన జ్వరంతో భాదపడుతున్నారు. ప్రతి ఇంటికి 700 లీటర్లు నీరు ఇస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఢిల్లీ జల బోర్డు అధికారులతో ఆయన తన నివాసంలో సమావేశమై చర్చలు జరిపారు.

కేజ్రీవాల్ నివాసం నుంచే కొన్ని ముఖ్యమైన వాటిపై చర్చలు జరిపారు. ఆదివారం నుంచి తనకు 102 జ్వరం ఉందని ఆయన ఈరోజు ఉదయం ట్విటర్‌లో తెలిపారు. సోమవారం ఆఫీస్‌కు హాజరవడం చాలా ముఖ్యమని, నీటీ విషయంలో ప్రకటన చేయాలన్న ఆలోచనలో ఉన్నామని, దేవుడు తనను ఇదే సమయంలో అనారోగ్యవంతుణ్ణి చేశాడని ఆయన ట్విట్టర్ లో అన్నారు. వైద్యులు తనకు రక్తపరీక్షలు నిర్వహించి, విశ్రాంతి అవసరమని సూచించారని ఆయన తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 48 గంటల లోపే తన హామీలను నిలబెట్టుకునేందుకు కేజ్రీవాల్ ఉద్యుక్తులయ్యారు. ఢిల్లీ ప్రజలకు ఉచితంగా మంచినీళ్లు సరఫరా చేసే నిర్ణయం తీసుకున్నారు. కుటుంబానికి నెలకు 20 కిలోలీటర్ల మంచినీళ్లను ఉచితంగా సరఫరా చేస్తారు. ఇది జనవరి 1వ తేదీనుంచి అమలులోకి వస్తంది.

Arvind Kejriwal

లిక్కర్ మాఫియా చేతులో హతమైనట్లు భావిస్తున్నట్లు కానిస్టేబుల్ కుటుంబానికి ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కోటి రూపాయల నష్ట పరిహారాన్ని ప్రకటించింది. వినోద్ అనే పోలీసు కానిస్టేబుల్ ఢిల్లీ ప్రభుత్వం ఆబ్కారీ శాఖలో డిప్యుటేషన్‌పై పనిచేశాడు.

ఢిల్లీ సమీపంలోని ఘిటోమి గ్రామంలో సోదాలు నిర్వహిస్తుండగా లిక్కర్ మాఫియా కొట్టడంతో అతను మరణించాడని చెబుతున్నారు. ఈ సంఘటన డిసెంబర్ 27 తేదీన జరిగింది.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal on Monday fall sick and expresed his unhappiness over not being able to attend the office and announce the big decision of providing free water to the Delhiites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X