
యూపీలో డెంగ్యూ, అంతుచిక్కని వైరల్ జ్వరాల కలవరం: ఫిరోజాబాద్‌లో 105 కొత్త కేసులు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ వైపు కరోనావైరస్ కేసులు తగ్గుతుండగా.. మరోవైపు విపరీతంగా వ్యాప్తిచెందుతున్న వైరల్ జ్వరాలు ఆందోళనకలిగిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ వైరల్ జ్వరాల బారినపడి పదుల సంఖ్యలో మృతి చెందారు. వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఒక్క ఫిరోజాబాద్‌లోనే 105 మంది డెంగ్యూ జ్వరతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 51 మంది మరణించారు. ఆదివారంనాడు 105 మంది డెంగ్యూ, వైరల్ ఫీవర్ బాధితులు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేరారని, మరో 60 మంది కోలుకున్నారని తెలిపారు మెడికల్ కాలేజీ డాక్టర్ సంగీత అనేజా తెలిపారు. మరో 445 మంది వివిధ వార్డుల్లో జ్వరాలతో చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు.

డెంగ్యూ,
వైరల్
వ్యాధులు
ప్రబలుతన్న
ప్రాంతాల్లో
వైద్య
అధికారులు
పర్యటించి
వైద్యం
అందిస్తున్నారు.
డెంగ్యూ
లేదా
వైరల్
జ్వరం
వచ్చిన
వెంటనే
వైద్యులను
సంప్రదించాలని
ప్రజలకు
సూచించారు.
మంచినీటిని
బాగా
తాగాలని
సూచిస్తున్నారు.
కాగా,
ఉత్తరప్రదేశ్‌లోని
వివిధ
జిల్లాలలో
డెంగ్యూ,
మలేరియా,
వైరల్
జ్వరాలు
వ్యాప్తి
చెందుతున్నాయి.
అంతు
చిక్కని
జ్వరం
రావడంతో
పదుల
సంఖ్యలో
పిల్లలు
చనిపోయారు.
వ్యాధి
వ్యాప్తి,
బాధితుల
పట్ల
నిర్లక్ష్యంగా
వ్యవహరించిన
ముగ్గురు
డాక్టర్లను
ఫిరోజాబాద్
కలెక్టర్
సస్పెండ్
చేశారు.
ఇప్పటివరకు డెంగ్యూ, అంతు చిక్కని జ్వరంతో 50 మంది మరణించారని ఫిరోజాబాద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ దినేష్ కుమార్ వెల్లడించారు. ఇప్పటి మొత్తం 3,719 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 2,533 మంది జ్వరంతో బాధపడుతున్నారు. అదే సమయంలో మధుర, ఝాన్సీ సహా అనేక జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. కాగా, అన్ని జిల్లాలో పర్యటించి ప్రత్యేక ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.
రాష్ట్రవ్యాప్తంగా 60 మందికి పైగా బలితీసుకున్న ఈ అంతు చిక్కని జ్వరం స్క్రబ్ టైఫస్‌గా వైద్యులు పిలుస్తున్నారు. చిగ్గర్లు అంటే లార్వా పురుగుల కాటు ద్వారా ఈ జ్వరం వ్యాప్తి చెందుతోందని ప్రాథమికంగా యూపీ వైద్యులు గుర్తించారు. ఫిరోజాబాద్‌లో అత్యధికంగా ఈ జ్వరం కేసులు నమోదవుతుండగా ఆగ్రా, మెయిన్‌పురి, ఎటా, ఝాన్సీ, ఈరయ్య, కాన్పూర్, సహరాన్‌పూర్, కస్గంజ్‌లో కూడా ఇటువంటి కేసులు నమోదయ్యాయి.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) ప్రకారం స్క్రబ్ టైఫస్ జ్వరాన్ని స్క్రబ్ టైఫస్ అని కూడా అంటారు. ఈ వ్యాధికి ఓరియెంటా సుత్సుగముషి అనే బ్యాక్టీరియా కారణమవుతుంది. ఈ బ్యాక్టీరియా సోకిన చిగ్గర్స్ (లార్వా పురుగులు) కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం ఒక వ్యక్తిని అనారోగ్యానికి గురి చేస్తుంది. చిగ్గర్లు కాటు వేసిన 10 రోజుల్లో వ్యాధి తీవ్రంగా మారడం ప్రారంభమవుతుందని వైద్యులు గుర్తించారు.
లక్షణాల
విషయానికొస్తే..
స్క్రబ్
టైఫస్
లక్షణాలు
సాధారణంగా
10
రోజుల్లో
కనిపిస్తాయి.
ఓరియెంటా
సుత్సుగముషి
బ్యాక్టీరియా
సోకిన
చిగ్గర్స్
కాటు
,
లక్షణాలు
కనిపించడం
ప్రారంభించిన
10
రోజుల్లో
ఇన్‌ఫెక్షన్
వ్యాప్తి
చెందుతాయి.
వ్యాధి
సోకిన
వ్యక్తిలో
జ్వరం,
జలుబు,
తలనొప్పి,
శరీరం,
కండరాల
నొప్పులు,
చిరాకుగా
ఉండటం,
శరీరంపై
దద్దుర్లు
మొదలగు
లక్షణాలుంటాయి.
ఈ వ్యాధి వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా, ఆగ్రా, ఫిరోజాబాద్ జిల్లాలలో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ప్రిన్సిపల్ సెక్రటరీ (వైద్య విద్య)ను ఆదేశించారు. డెంగ్యూతో సహా వైరల్ వ్యాధుల చికిత్స కోసం కోవిడ్ రోగుల కోసం ఆక్సిజన్ సౌకర్యంతో ఐసోలేషన్ బెడ్‌లను ఉంచాలని సూచించారు. దీంతో ఆరోగ్య శాఖ బృందాలు గ్రామీణ ప్రాంతాలు, జ్వర ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయి. బాధితులకు అక్కడే చికిత్స అందిస్తున్నాయి. తీవ్రంగా ఉన్నవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నాయి.