జాతీయ గీతానికి ఘోర అవమానం? ఆలాపన మధ్యలోనే వెళ్లిపోయిన అసెంబ్లీ స్పీకర్

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో శనివారం జరిగిన ఓ పాఠశాల కార్యక్రమంలో ఊహించని ఘటన వెలుగుచూసింది. ప్రిన్సిపాళ్ల కౌన్సిల్, విద్యా సదస్సు ముగింపు సందర్భంలో ముఖ్య అతిథిగా హాజరైన యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలోనే వేదిక దిగి వెళ్లిపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రోటోకాల్ ప్రకారం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన వెంటనే జాతీయ గీతం ప్రారంభమైంది. అయితే గీతం సాగుతుండగానే ఆయన వేదిక వెనుక వైపునకు నడుచుకుంటూ వెళ్లారు.

సతీష్ మహానా వేదిక దిగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఆయన అనుచరులు, మద్దతుదారులు ఆయనను చుట్టుముట్టి పాదాలకు నమస్కరించడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన నేరుగా తన వాహనం ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పూరన్ నగర్‌లోని ఒక పాఠశాలలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై నిర్వాహకులు వివరణ ఇస్తూ.. స్పీకర్ ఉన్న ప్రదేశానికి, జాతీయ గీతం మైక్ స్పీకర్లకు మధ్య కాస్త దూరం ఉండటం వల్ల ఈ పొరపాటు జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు.

UP Assembly Speaker Satish Mahana Walks Off Stage During National Anthem in Unnao Sparking Controversy

వందేమాతరం గీతం ఆలపించకుండా సోనియా గాంధీ అడ్డుకున్నారా?
వందేమాతరం గీతం ఆలపించకుండా సోనియా గాంధీ అడ్డుకున్నారా?

సంస్థలు బలంగా ఉంటేనే దేశం దృఢంగా ఉంటుంది

ఈ కార్యక్రమానికి సాయంత్రం వేళ హాజరైన సతీష్ మహానా దాదాపు 40 నిమిషాల పాటు అక్కడే గడిపారు. ఈ సందర్భంగా 'శిక్షా ప్రభ' పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన, ఉపాధ్యాయులు , ప్రిన్సిపాళ్లు తమ బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని కోరారు. విద్యాసంస్థలే దేశ పురోగతికి మూలస్తంభాలని, సంస్థలు బలంగా ఉన్నప్పుడే దేశం కూడా దృఢంగా తయారవుతుందని వ్యాఖ్యానించారు. అలాగే అయోధ్య రామాలయం విరాళాల వివాదంపై స్పందిస్తూ.. భక్తులు ఇచ్చిన కానుకలు దేవుడి పాదాల వద్ద సమర్పించినవని, వాటిని తిరిగి కోరడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు.

సీఎంతో సహా 52 మందికి ప్రాణహాని? ఎన్నికలకు ముందే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు
సీఎంతో సహా 52 మందికి ప్రాణహాని? ఎన్నికలకు ముందే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు

కాంగ్రెస్ ఆగ్రహం: జాతీయ గీతానికి అవమానం కాదా?

ఈ ఘటనపై స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం పోలీసుల వందనం స్వీకరించిన స్పీకర్, జాతీయ గీతాన్ని పూర్తిస్థాయిలో గౌరవించకుండా మధ్యలోనే వెళ్లిపోవడం తీవ్రమైన తప్పిదమని ఉన్నావ్‌ కాంగ్రెస్‌ కమిటీ నేత దినేష్ శుక్లా ఆరోపించారు. ఇది జాతీయ గీతాన్ని అవమానించడమేనని విమర్శించారు. గతంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సమయంలో కూడా సభలో చోటుచేసుకున్న రచ్చపై తీవ్ర మనస్తాపం చెంది తన పదవికి రాజీనామా చేస్తానని సతీష్ మహానా హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+