ముస్లిం రక్తం ఉన్న హిందువులే నాకు ఓటు వేయరు-యూపీ బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
యూపీలో ఎన్నికల వేళ మత రాజకీయాలు పతాకస్ధాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే తమకు ఓటు వేయని వారంతా హిందువులకు వ్యతిరేకమన్నట్లుగా అధికార బీజేపీ వ్యాఖ్యలు చేస్తుండగా.. ఇప్పుడు ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్యే ఓటర్లను ఉద్దేశించి షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు.
నాకు ఓటు వేయని హిందువుల లోపల ముస్లిం రక్తం ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ చేసిన వ్యాఖ్యలు యూపీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సింగ్ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దోమరియాగంజ్ ఎమ్మెల్యే, హిందూ యువ వాహినికి ఇన్‌చార్జ్ గా కూడా ఉన్న ప్రతాప్ సింగ్.. మార్చి 3న జరిగే యూపీ ఎన్నికల పోరులో మరోసారి తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తనకు ఓటు వేయరని భావిస్తున్న వారిపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ సింగ్.. ఉద్దేశ్యపూర్వకంగా వ్యంగ్య పదాలను ఉపయోగిస్తున్నట్లు తేలింది. "చెప్పండి, ఎవరైనా నాకు ఓటు వేస్తారా ? కాబట్టి ఈ గ్రామంలోని హిందువులు నా ప్రత్యర్ధులకు మద్దతు ఇస్తే, వారి నరాలలో ముస్లిం రక్తం ఉందని గుర్తుంచుకోండి. వారు దేశద్రోహులు.
ఇన్ని దారుణాలు జరిగిన తర్వాత కూడా, ఒక హిందువు అటువైపు వెళితే, అతను తన ముఖాన్ని బహిరంగంగా చూపించడానికి అనుమతించకూడదంటూ ప్రతాప్ సింగ్ వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఈ వీడియోలో ఉంది. దీనిపై తాజాగా స్పందించిన ప్రతాప్ సింగ్.. తన వ్యాఖ్యల సందర్భం వేరని, ఎవరినీ బెదిరించేందుకు కాదన్నారు.












Click it and Unblock the Notifications