వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్: అందుకే !

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ త్వరలో కర్ణాటకలోని కదళి (కద్రి) జోగి మఠం, ఉడిపిలోని ప్రసిద్ది చెందిన శ్రీకృష్ణ మఠం సందర్శించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

మంగళూరు: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ త్వరలో కర్ణాటకలోని కదళి (కద్రి) జోగి మఠం, ఉడిపిలోని ప్రసిద్ది చెందిన శ్రీకృష్ణ మఠం సందర్శించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఆదివారం యోగి ఆదిత్యనాథ్ కర్ణాటకలో పర్యటించే అవకాశం ఉందని సమాచారం.

2016లో మంగళూరులోని కదళి జోగి మఠంలో జరిగిన మహారాజ పట్టాభిషేకం కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అథితిగా హాజరైనారు. ఆ సమయంలో ఓ దేవాలయం ప్రధాన అర్చకుడిగా యోగి ఆదిత్యనాథ్ మంగళూరుకు వచ్చారు.

UP chief minister Yogi Adityanath will be there in Kadri temple, Mangaluru soon

ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో మరో సారి మంగళూరులోని కదళి జోగి మఠం, ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంకు భేటీ కానున్నారు. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్ ను సన్మానించాలని కదళి జోగి మఠం నిర్వహకులు నిర్ణయించారు.

వచ్చే ఆదివారం కదళి జోగి మఠం వార్షిక మహోత్సవం వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఆహ్వానించామని, ఆయన తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరౌతారని కదళి జోగి మఠం పరిపాలన విభాగం కమిటీ ఉపాధ్యక్షుడు కేశవానంద ఒన్ ఇండియా (కన్నడ)కు చెప్పారు.

English summary
UP chief minister Yogi Adityanath will be there in Kadri temple, Mangaluru soon. To congratulating him for his appointment as CM of the largest state of India, administration of Jogi Math invited him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X