లైవ్: ఉత్తరప్రదేశ్ 'మున్సిపల్' ఫలితాలు.. అమేథీలో రాహుల్‌కు షాక్, బీజేపీ స్వీప్

లక్నో: ఉత్తరప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ తుది అంకానికి చేరుకుంది. శుక్రవారం ఉదయం 8గం. ఓట్ల లెక్కింపు మొదలు కాగా.. తొలి నుంచి బీజేపీ ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. తుది అంకానికి చేరుకునేసరికి బీజేపీ 12మేయర్ స్థానాలను దక్కించుకోగా.. బీఎస్పీ 2 స్థానాలను దక్కించుకుంది.

వారణాసి, గోరఖ్ పూర్, ఘజియాబాద్, బరేలీ, ఆగ్రా, ఫిరోజాబాద్, అయోధ్య, మథుర, లక్నో, కాన్పూర్, షహరన్ పూర్, మొరాదాబాద్ మున్సిపాలిటీల్లో బీజేపీ గెలుపొందింది. అలీఘర్, మీరట్ స్థానాలను బీఎస్పీ దక్కించుకోవడం విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఢీలా పడ్డ బీఎస్పీ మున్సిపల్ ఫలితాల్లో అనూహ్యంగా పుంజుకుందనే చెప్పాలి.

కాగా, నవంబర్ 22, 26, 29తేదీల్లో ఉత్తరప్రదేశ్ మున్సిపాలిటీలకు మొత్తం మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే.16మున్సిపల్ కార్పోరేషన్స్, 198మున్సిపల్ కౌన్సిల్స్, 438నగర పంచాయితీల పరిధిలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 3.32కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

లైవ్ అప్ డేట్స్:

  • బీజేపీ 9మేయర్ స్థానాలు గెలుచుకోగా.. బీఎస్పీ ఒక స్థానం గెలుచుకుంది.
  • అమేథీలో బీజేపీ గెలుపు. రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు కాంగ్రెస్ కు పెద్ద దెబ్బ అనే చెప్పాలి.
  • మొత్తం 16మున్సిపాలిటీల్లో 13స్థానాల్లో బీజేపీ, 3 స్థానాల్లో బీఎస్పీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
  • అయోధ్యలో బీజేపీ అభ్యర్థి హృషికేష్ గెలుపు.
  • మీరట్, ఆగ్రా, ఝాన్సీల్లో ఆధిక్యంలో బీఎస్పీ
  • బీఎస్పీ 34స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఎస్పీ పార్టీని మూడో స్థానానికి నెట్టింది.
  • రాంపూర్ కౌంటింగ్ కేంద్రం వద్ద హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
  • అలహాబాద్ లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా.. ఎస్పీ, బీఎస్పీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
  • మథురలోని 56వ వార్డులో బీజేపీ అభ్యర్థి మీరా అగర్వాల్‌కు, కాంగ్రెస్ అభ్యర్థికి 874ఓట్లు వచ్చాయి. ఇద్దరికీ సేమ్ ఓట్లు రావడంతో లక్కీ డ్రా తీశారు. లక్కీ డ్రాలో అగర్వాల్ గెలుపొందడం విశేషం.
  • ముజఫర్‌నగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు లాఠీ చార్జీ చేయగా.. నలుగురు గాయపడ్డారు.
  • మొత్తం 16మున్సిపాలిటీల్లో బీజేపీ 12స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
  • మీరట్‌లో బీఎస్పీ, మథురలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
  • షహజనపూర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు రంగంలోకి దిగి భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
  • బీజేపీ-9234, బీఎస్పీ - 8315, కాంగ్రెస్ - 1909 and ఎస్పీ - 1140
  • లెహర్‌పూర్ పరిధిలోని సీతాపూర్ లో సమాజ్‌వాదీ పార్టీ ఆధిక్యంలో ఉంది.
  • ఫిలిబిత్ లో బీజేపీ ఆధిక్యం
  • మొరదాబాద్ లో బీజేపీ మేయర్ అభ్యర్థి వెయ్యి ఓట్లతో ముందంజ. రెండో స్థానంలో బీఎస్పీ. తర్వాతి స్థానాల్లో ఎస్పీ, కాంగ్రెస్
  • లక్నో, కాన్పూర్ లలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం
  • వారాణాసిలోని ఐదు సెగ్మెంట్లలో బీజేపీ ఆధిక్యం
  • లక్నో, ఘజియాబాద్, మీరట్, గోరఖ్ పూర్ లలో బీజేపీ ఆధిక్యం
  • ఉదయం 8గం.కు 334కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
  • ఈ ఏడాది మార్చిలో కొలువుదీరిన యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కు ఈ ఎన్నికల ఫలితాలు ఒక పరీక్షగా మారనున్నాయి.
  • ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సర్వే ఫలితాలు బీజేపీకే అనుకూలంగా రావడం గమనార్హం. 16కార్పోరేషన్స్ కు గాను 15కార్పోరేషన్స్ లో బీజేపీనే సునాయాసంగా గెలుస్తుందని సర్వే వెల్లడించింది.
  • ఈ ఎన్నికల్లో 75జిల్లాలకు చెందిన 3.32కోట్ల మంది ప్రజలు 32,269పోలింగ్ బూత్ లు, 11,389పోలింగ్ స్టేషన్లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • నవంబర్ 22న జరిగిన మొదటి దశ పోలింగ్ లో 52.59శాతం పోలింగ్ నమోదైంది. నవంబర్ 26న జరిగిన రెండో దశలో 49.3శాతం, నవంబర్ 29న జరిగిన మూడో దశలో 53శాతం పోలింగ్ నమోదైంది.
  • అన్ని పోలింగ్ బూత్ లలో మూడు దశల్లో నమోదైన ఓటింగ్ ను బట్టి మొత్తం 52.5శాతం పోలింగ్ నమోదైనట్లు నిర్దారించారు.
  • శుక్రవారం ఉదయం 8గం. నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+