Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూపీ రిజల్ట్స్: మాయావతికి మళ్ళీ జోష్

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఎస్పీ రెండు మేయర్ స్థానాలను కైవం చేసుకొంది. అలీఘడ్, మీరట్ స్థానాల్లో బిఎస్పీ విజయం సాధించింది.ఝాన్సీ స్థానంలో ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఈ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే బిఎస్పీ తిరిగి పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్, బుందేల్‌ఖండ్ రీజియన్‌లో బిఎస్పీ ఎక్కువగా ఓట్లను సాధించింది. దళితులు, ముస్లింల కాంబినేషన్ బిఎస్పీకి కలిసివచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

UP Civic Poll Results: Mayawati's BSP Showing Signs of Revival

ఝాన్సీ స్థానంలో కూడ బిఎస్పీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. నవంబర్ 22, 26, 29 తేదిల్లో యూపిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి.అయితే ఓట్లను భారీ భద్రత మధ్య శుక్రవారం నాడు లెక్కిస్తున్నారు.రాష్ట్రంలోని సుమారు 334 కౌంటింగ్ సెంటర్లలో సిసిటీవి పర్యవేక్షణలో ఓట్లను లెక్కిస్తున్నారు.

16 నగర నిగామ్స్, 198 నగర పాలక పరిషత్, 438 నగర పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 3.32 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఈ ఎన్నికల్లో బిఎస్పీ అధినేత్రి ప్రచారం చేయలేదు. కానీ, ఓటర్లు మాత్రం ఆ పార్టీకి పట్టం కట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+