యోగీ ఎంట్రీతో కీలక మలుపు - ఆట మొదలు..!!

ఢిల్లీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు ప్రధాన పార్టీలకు ఇక్కడ గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ముందుగానే ఎన్నికల బరిలో దిగిన కేజ్రీవాల్ విజయం తమ దే అని ధీమాగా ఉన్నారు. బీజేపీ హర్యానా, మహారాష్ట్ర తరహాలోనే ఢిల్లీలోనూ విజయం సాధిస్తామ ని విశ్వాసంతో ఉంది. కాంగ్రెస్ మేము సైతం అంటోంది. అయితే, ఢిల్లీ ఎన్నికల ప్రచారం యూపీ సీఎం యోగీతో కొత్త మలుపు తీసుకుంది. కేజ్రీవాల్ లక్ష్యంగా యోగీ తన మార్క్ రాజకీయం మొదలు పెట్టారు.

కేజ్రీవాల్ లక్ష్యంగా
ఢిల్లీ ఎన్నిక ప్రచారం పతాక స్థాయికి చేరింది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు ఢిల్లీ ప్రచారంలోకి దిగారు. యూపీ సీఎం యోగీ ఢిల్లీలో యూపీ, బీహార్ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ఆప్, కేజ్రీవాల్ లక్ష్యంగా యోగీ తన అస్త్రాలను సంధించారు. కేజ్రీవాల్ కు సవాళ్లు చేసారు. ఆప్ పాలనలో ఢిల్లీ డంపింగ్ యార్డుగా మారిందని ఆరోపించారు. విద్యుత్ నిరంతర సరఫరాలోనూ ప్రభుత్వం విఫలమైందని టార్గెట్ చేసారు. యమునా నది మొత్తం కలుషితంగా మారిందని చెప్పిన యోగీ.. తాను చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోతే కేజ్రీవాల్ యమున నదిలో స్నానం చేయాలని సవాల్ విసిరారు.

UP CM Yogi Adityanath attacked the Aam Aadmi Party in his Delhi Election campaign

యోగీ టార్గెట్
యోగీ ఆరోపణలపైన కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. యూపీలో విద్యుత్ కోతల గురించి ప్రశ్నించారు. ఢిల్లీలో విద్యుత్ సరఫరా గురించి ప్రశ్నిస్తున్న యోగీ.. పదేళ్లుగా యూపీలో అధికారం లో ఉండి..ఎన్ని గంటలు విద్యుత్ ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు. దీనికి యోగీ స్పందిం చారు. ఆప్ అసమర్థ పాలనలో విదేశాల నుంచి అక్రమ వలసలు పెరిగాయని విమర్శించారు. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్నారనే వ్యాఖ్యల తో ప్రచారం కొత్త టర్న్ తీసుకుంది. వారిని అడ్డుకోకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని విమర్శించారు.

గెలుపు పై ధీమా
ఢిల్లీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదని.. ఢిల్లీ రహదారుల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని యోగీ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల పైన భారం మోపారని టార్గెట్ చేసారు. అసత్యాలు ప్రచారం చేయటమే ఆప్ నేతల పని అంటూ ధ్వజమెత్తారు. మరో వైపు బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా సైతం ఢిల్లీలో ప్రచారం ప్రారంభించారు. ఈ నెలాఖరులో ప్రధాని మోదీ ఢిల్లీ ప్రచారంలో పాల్గొంటారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. హ్యాట్రిక్ పై ఆప్ గురి పెట్టింది. కాగా, గెలుపు తమదే అంటూ బీజేపీ కొత్త వ్యూహాలతో ఎన్నికల బరిలో ముందుకు వెళ్తోంది. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+