• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

BJP: అయోధ్య బరిలో ఆదిత్యనాథ్ -సీఎం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే త్యాగం -ఏం చేశారని వస్తారట?

|
Google Oneindia TeluguNews

దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ పై తన పట్టు నిలుపుకొనేందుకు బీజేపీ అనూహ్య ఎత్తుగడలు సిద్ధం చేస్తున్నది. కరోనా విపత్తు నిర్వహణలో వైఫల్యం, రైతుల ఉద్యమం, అధిక ధరలు, మహిళలపై హత్యాచారాలు తదితర అంశాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న యోగి సర్కారు మళ్లీ రామ నామాన్నే ప్రధానాస్త్రంగా ప్రయోగించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా..

రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ రామజన్మభూమి అయోధ్య అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లు కమలనాథులే ప్రచారం చేస్తున్నారు. అయోధ్య సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ గుప్తా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ''సీఎం యోగి అయోధ్యలో పోటీ చేయాలనుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ప్రయారిటీల్లో అయోధ్య కూడా ఒకటి. సీఎం గనుక అయోధ్యనే ఎంచుకుంటే, ఆయన కోసం నేను తప్పుకోడానికి సిద్ధంగా ఉన్నాను'' అని చెప్పారు. కాగా,

viral video: అత్యంత భయానకంగా -కొండచరియలు పడి భారీగా టూరిస్టుల దుర్మరణం, మోదీ సంతాపంviral video: అత్యంత భయానకంగా -కొండచరియలు పడి భారీగా టూరిస్టుల దుర్మరణం, మోదీ సంతాపం

up cm Yogi Adityanath may contest 2022 election from Ayodhya, cong, sp slams bjp

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో పోటీకి దిగబోతున్నారంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే గుప్తా చేసిన ప్రకటనపై కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు మండిపడ్డాయి. ''యోగిని అయోధ్యకు ఆహ్వానిస్తోన్న ఎమ్మెల్యే గుప్తా అసలేం చేశారని యోగిని పిలుస్తున్నారో ప్రజలకు వివరించాలి. అయోధ్య సెట్మెంట్లో ఎంత మందికి ఉపాధి అవకాశాలిచ్చారు? ఎన్ని కరోనా మరణాలను ఆపగలిగారు? మహిళలు, రైతులపై దురాగతాల లెక్కలు చెప్పగలరా?'' అని కాంగ్రెస్ నేత సురేంద్ర రాజ్ పుత్ ప్రశ్నించారు. అటు,

షాక్:సీబీఐ జేడీ చేసింది చాలా తక్కువ -జగన్ లూటీలు అన్నీ మోదీకి చెప్పేస్తా -ఎంపీ రఘురామ రియాక్షన్షాక్:సీబీఐ జేడీ చేసింది చాలా తక్కువ -జగన్ లూటీలు అన్నీ మోదీకి చెప్పేస్తా -ఎంపీ రఘురామ రియాక్షన్

అయోధ్యలో ఆదిత్యనాథ్ పోటీ చేయడమనేది బీజేపీ అంతర్గత వ్యవహారం అంటూనే కమలదళంపై విమర్శలు చేసింది సమాజ్ వాదీ పార్టీ. ఆ పార్టీ నేత జూహీ సింగ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ''2017నుంచీ యూపీలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలు ప్రత్యక్షంగా అనుభవించారు. శాంతిభద్రతల నిర్వహణలో, ఉపాధి కల్పనలో, నేరాలను నిరోధించడంలో సీఎం యోగి ఘోరంగా ఫెయిలయ్యారు. కేవలం హెడ్ లైన్లలో ఉండేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారుగానీ, జనం కోసం చేసిందేమీ లేదు'' అని ఎస్పీ నేత మండిపడ్డారు. 404 సీట్లున్న యూపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయి.

English summary
In the run-up to the Uttar Pradesh Assembly polls in 2022, political circles are abuzz with speculation that Chief Minister Yogi Adityanath may contest the election from Ayodhya constituency. Ved Prakash Gupta, who is sitting MLA from Ayodhya, said on Sunday that he is ready to give up his seat for the chief minister. meanwhile, congress and samajwadi party slams bjp ayodhya mla.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X