Yogi Adityanath: ఉపాధ్యాయుల ఎంపికకు ఒకే కమిషన్ ఉండాలి: యోగి ఆదిత్యనాథ్

ఉత్తర ప్రదేశ్ లో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, సాంకేతిక, మైనారిటీ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల నియామకాల కోసం ఏకీకృత కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ శిక్షా సేవా చాయన్ ఆయోగ్ లేదా ఉత్తరప్రదేశ్ ఎడ్యుకేషన్ సర్వీస్ సెలక్షన్ కమీషన్ కొత్త సంస్థ ఏర్పాటు చేయనున్నారు. ఆర్థిక క్రమశిక్షణతో పాటు మానవ వనరుల మెరుగైన వినియోగాన్ని నిర్ధారించడంలో కమిషన్ కీలక పాత్ర వహిస్తుందని ఆ ప్రభుత్వం తెలిపింది.

ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, సాంకేతిక విద్యాసంస్థల్లో అర్హులైన ఉపాధ్యాయుల ఎంపిక కోసం ప్రత్యేక అధికారులు, బోర్డులు, కమీషన్లు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. వివిధ కేటగిరీల పాఠశాలలు, కళాశాలలకు ఉపాధ్యాయుల నియామకం కొత్త కమిషన్ ద్వారా జరుగుతుందని వివరించింది. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న వివిధ ఉపాధ్యాయుల ఎంపిక కమీషన్లు కొత్త సంస్థలో విలీనం చేయనున్నారు.

ప్రస్తుతం ఎగ్జామినేషన్ రెగ్యులేటరీ అథారిటీ, సెకండరీ ఎడ్యుకేషన్ సర్వీస్ సెలక్షన్ కమిషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వీస్ సెలక్షన్ కమిషన్‌తో పాటు రాష్ట్రంలోని టీచర్లను యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కూడా ఎంపిక చేస్తున్నట్లు యోగి తెలిపారు. ఉన్నత లేదా మాధ్యమిక విద్యకు చెందిన మైనారిటీ సంస్థల కోసం, ఎంపిక ప్రక్రియ బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ద్వారా నిర్వహిస్తున్నారని చెప్పారు. సాంకేతిక విద్య కోసం ఇది బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ద్వారా జరుగుతుందని వివరించారు.

yogi-adityanath

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆచరణాత్మక సంస్కరణలు చేపట్టేందుకు ఉపాధ్యాయుల ఎంపిక కోసం ఏకీకృత కమిషన్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఇది అటానమస్ రెగ్యులేటెడ్ బాడీ అయి ఉండాలని, ఇది ఉపాధ్యాయుల ప్రత్యక్ష రిక్రూట్‌మెంట్‌పై మార్గదర్శకాలను నిర్దేశిస్తుందని చెప్పారు. కమిషన్ ఏర్పాటుకు ప్రతిపాదనను సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కొత్త కమిషన్ స్వభావం, దాని అధికారాలు, విధులతో పాటు కమిషన్ ఛైర్మన్, సభ్యుల అర్హతపై కూడా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా లేదా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)లో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిని కమిషన్ చైర్మన్‌గా నియమించాలని ఆయన అభిప్రాయపడ్డారు. సభ్యులలో సీనియర్ న్యాయమూర్తులు, అనుభవజ్ఞులైన విద్యావేత్తలు ఉండాలని చెప్పారు. సమీకృత సంస్థలో ఇతర వెనుకబడిన తరగతులు (OBCలు), షెడ్యూల్డ్ కులాలు/తెగలు, మహిళలు, మైనారిటీల ప్రాతినిధ్యం ఉండేలా కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+