హొలీ వేడుకల్లో అరాచక శక్తులపై కన్నేసి ఉంచండి..!
గోరఖ్‌పూర్: మార్చి 8వ తేదీన హోలీ పండుగను పురస్కరించుకుని ఉత్తర్ ప్రదేశ్‌లోని యోగీ సర్కార్ గట్టి భద్రతా చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం యోగీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సంప్రదాయం ప్రకారం శోభాయాత్రలు చేపట్టాలని చెప్పిన ఆయన ఎట్టి పరిస్థితుల్లోను అరాచకాలు జరగడానికి వీలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని సీఎం అన్నారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం తన సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్ చేరుకున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్ గోరఖ్‌నాథ్ ఆలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హోలీ సందర్భంగా ఎలాంటి అసభ్యకరమైన నృత్యాలు ఉండకూడదని ఇలాంటివి ఎక్కడైనా జరిగితే చర్యలు తీసుకోవాలని సూచించారు.హోలీ వేడుకల కోసం ప్రత్యేకంగా విడుదల చేసిన నిధులను ఎమ్మెల్యేలు, ఎంపీలు వినియోగించుకోవాలని సీఎం సూచించారు.ఇక ఈ ఏడాది బడ్జెట్‌ను అభివృద్ధి పనులకు వినియోగించి సకాలంలో పనులు పూర్తి చేయాలని వెల్లడించారు.

ఇక పారిశ్రామిక కారిడార్ కోసం ధురియాపర్‌లో భూమి సేకరించాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. వెంటనే భూములను కొనుగోలు చేయాలని అధికారులకు చెప్పారు. ఇప్పటికే రూ.200 కోట్లు ఇందుకోసం కేటాయించినట్లు జీఐడీఏ సీఈఓ సీఎంకు వివరించారు. భూమి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసినట్లు చెప్పారు. బడ్జెట్ కొరత కూడా లేదని సీఈఓ సీఎంకు వివరించారు. ఇప్పటికే భూసేకరణకు సంబంధించి ప్రాథమిక పనులు ప్రారంభం అయ్యాయని సీఎం యోగీ దృష్టికి తీసుకొచ్చారు.












Click it and Unblock the Notifications