వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగి ఆదిత్య ఆస్తులు: రివాల్వర్ - రైఫిల్ విలువ ఎంతంటే: సొంత వాహనమూ లేదు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

2024 ఎన్నికల ముందు సెమీస్ గా భావిస్తున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ కీలకంగా మారింది. ఇక, తొలి సారి అసెంబ్లీ బరిలో నిలుస్తున్న ప్రస్తుత సీఎం యోగి గోరఖ్ పూర్ అర్బన్ నుంచి తన నామి నేషన్ దాఖలు చేసారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో కలిసి ఆయన తన నామినేషన్ దాఖలు చేసారు. నామినేషన్ తో పాటుగా తన ఆస్తులు..అప్పుల వివరాలతో అఫిడవిట్ సమర్పించారు. తన ఆస్తుల విలువ రూ.1,54,94,054గా ప్రకటించారు. ఇందులో చేతిలో నగదు, ఆరు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి.

యోగీ వద్ద రివాల్వర్ - రైఫిల్

యోగీ వద్ద రివాల్వర్ - రైఫిల్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి తన వద్ద రూ. 12,000 విలువైన సామ్‌సంగ్ మొబైల్ ఫోన్, రూ. 1,00,000 విలువైన రివాల్వర్, రూ. 80,000 విలువైన రైఫిల్ ఉన్నట్లు ప్రకటించారు. యోగి ఆదిత్యనాథ్ వద్ద రూ.49,000 విలువైన 20 గ్రాముల బంగారు చెవి ఆభరణం ఉందని ప్రకటించారు. గోరఖ్‌పూర్ నుంచి ఐదు పర్యాయాలు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. గోరఖ్‌పూర్ అర్బన్ స్థానానికి మార్చి 3న యూపీ ఎన్నికల ఆరో దశ పోలింగ్ జరగనుంది.

ఈ ఎన్నికల్లో ప్రధానంగా యెగీ చుట్టూనే ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ సైతం యోగి చేసిన కార్యక్రమాలు..డెవలప్ మెంట్ గురించే ప్రధానంగా తన ఎన్నికల ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నారు.

గోరఖ్ పూర్ నుంచి నామినేషన్

గోరఖ్ పూర్ నుంచి నామినేషన్

ప్రతిపక్షాలకు యోగి నే టార్గెట్ అవుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ తన అఫిడవిట్‌లో 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 13,20,653 ఆదాయం, 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 15,68,799 ఆదాయం, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 18,27,639, రూ. 670, 38, 174 ఆదాయాన్ని ప్రకటించారు. 2017-18 కోసం.

యూపీ ముఖ్యమంత్రి తన పోల్ అఫిడవిట్ ప్రకారం ఎటువంటి వాహనం రిజిస్టర్ చేయలేదన్నారు. యోగి ఆదిత్యనాథ్ పోల్ అఫిడవిట్ ప్రకారం, అతనిపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు. తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తర్వాత, యోగి ఆదిత్యనాథ్ మీరట్, ఘజియాబాద్, అలీఘర్, హాపూర్, నోయిడాలోని ఓటర్లను ఉద్దేశించి వర్చువల్ ‘జన్ చౌపాల్' ద్వారా ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ప్రసంగించారు. రేపు (ఆదివారం) బీజేపీ తమ మేనిఫెస్టె ప్రకటించనుంది.

Recommended Video

UP Elections 2022 : UP ఓటర్లకు PM Modi విజ్ఞప్తి..రికార్డుల్ని బ్రేక్ చేసేద్దాం | Oneindia Telugu
ఆస్తుల వివరాలు వెల్లడి

ఆస్తుల వివరాలు వెల్లడి

తాము 2017లో ప్రధానంగా చేసిన వాగ్దానాల్లో కీలక హామీలు నెరవేర్చామని యోగి చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వాల హయాంలో ఉత్తరప్రదేశ్‌ పరిపాలనను గూండాలు, మాఫియాలు కబ్జా చేశారని ఆరోపించారు. ఈరోజు మహిళలకు భద్రతతో కూడిన వాతావరణం నెలకొని, పెట్టుబడులు పెరిగాయని, మాఫియాల కారణంగా వ్యాపారులు, యువత వలసలు కూడా ఆగిపోయాయని.. మాఫియాలు, నేరగాళ్ల వలసలు కొత్తవి అని యోగి వివరించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ ఆశీర్వదించ బోతున్నారంటూ..తమ గెలుపు పైన యోగి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

English summary
UP CM Yogi Adityanath reveal the assets and liabilities in his election nomination affidavit. Yogi have a revlover anda rifile cost of rs 1 lakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X