వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో కాంగ్రెస్‌కు గట్టి షాక్.. ఆర్పీఎన్ సింగ్ గుడ్ బై.. బీజేపీకి జై జై!?

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలలో తమ నేతల జంపింగ్ వ్యవహారం తీవ్ర కలవరం రేపుతోంది. ఎప్పుడు ఎవరు పార్టీని వీడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆపార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ హస్తానికి గుడై బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు.

కాంగ్రెస్ పార్టీకి ఆర్పీఎన్ సింగ్ రాజీనామా..

కాంగ్రెస్ పార్టీని వీడుతున్న విషయాన్ని ఆర్పీఎన్ సింగ్ తన ట్విటర్ ద్వారా తెలిపారు. తన రాజీనామా లేఖను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇక నుంచి త‌న రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా అంత‌కు ముందు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ ఛార్జీ అనే వాక్యాన్ని కూడా తొలగించారు. దీంతో ఆర్పీఎన్ సింగ్ పార్టీ పారుతున్నారన్న వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

యూపీలో హస్తం గెలుపుపై ప్ర‌భావం

యూపీలో హస్తం గెలుపుపై ప్ర‌భావం

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల్లో ఆర్పీఎన్ కూడా ఒకరు. ఆపార్టీకి అత్యంత నమ్మకస్తుడు. అలాంటి నేత అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ను వీడడం ఆపార్టీకి గట్టి దెబ్బే. ఖుషీనగర్‌లోని సైంత్వార్ రాజకుటుంబానికి చెందిన ఆయన గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు. పద్రౌనా నియోజకవర్గానికి 1996 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా ప‌నిచేశారు. అనంతరం 2009లో లోభసభ ఎంపీగా విజయం సాధించారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ఏఐసీపీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. యూపీలో కాంగ్రెస్ కీలక నేతగా ఎదిగారు.ఇప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ హ‌స్తాన్ని వీడ‌డం ఆపార్టీకి గ‌ట్టి దెబ్బేన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

అసంతృప్తితో రగిలిపోతున్న ఆర్పీఎన్ సింగ్

అసంతృప్తితో రగిలిపోతున్న ఆర్పీఎన్ సింగ్


అయితే ఆర్పీఎన్ సింగ్‌ను గత కొంత కాలంగా పార్టీ అధిష్టానం పక్కనపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. సోనియా గాంధీ కుటుంబంతోనూ దూరం పెరిగింది. అటు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార జాతితాలో కూడా ఆయన పేరు లేదు. ఈనేపథ్యంలోనే అసంతృప్తితో రగిలిపోతున్న ఆర్పీఎన్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. స్టార్ క్యాంపెయినర్ల జాబితా ప్రకటించిన మరుసటి రోజే ఆర్పీఎన్ సింగ్ హస్తానికి రాం రాం చెప్పడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Recommended Video

UP Elections 2022 : Congress CM అభ్యర్థి పై Priyanka Gandhi సంచలనం | Oneindia Telugu
 బీజేపీ గూటికి .. పద్రౌనా నుంచి బ‌రిలో..

బీజేపీ గూటికి .. పద్రౌనా నుంచి బ‌రిలో..


కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఆర్పీఎన్ సింగ్ బీజేపీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కమలం నేతలో ఆయనతో సంప్రదించినట్లు సమాచారం. పార్టీలో చేరిన తర్వాత ఆయనను పద్రౌనా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దించేందుకు బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే స్థానం నుంచి ఇటీవల కమలాన్ని వీడి సమాజ్ వాదీ పార్టీలో చేరిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యను పోటీలోకి దించింది. ఈ నేపథ్యంలో మౌర్యకు చెక్ పెట్టేందుకు ఆర్పీఎన్ సింగ్ ను బరిలోకి దించేయోచనలో బీజేపీ ఉంది.

English summary
Big Shock to congress in Uttarpradesh , RPN Singht resigns from party
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X