వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్పీకి భంగపాటు: షాపై ఛార్జీషీటుకు కోర్టు నిరాకరణ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర కోర్టులో భంగపాటు కలిగింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నైతిక నియామాళను ఉల్లంఘించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాపై అక్కడి పోలీసులు నమోదు చేసిన ఛార్జీషీటును కోర్టు తిరస్కరించింది.

కోర్టు తీర్పుతో అఖిలేష్ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక్కసారిగా కలవరపాటుకు గురిచేసింది. దీంతో బిజెపి రాష్ట్రాన్ని వర్గాల వారీగా విభజించాలని చూస్తోందని సమాజ్‌వాది పార్టీ ఆరోపించింది. కాగా, కోర్టు తీర్పు సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను పోలీసు అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా రాజకీయ కక్షతోనే అమిత్ షాపై ఛార్జీ షీటు నమోదు చేశారని రాష్ట్ర బిజెపి ప్రభుత్వంపై మండిపడింది.

UP court rejects chargesheet filed against Amit Shah, SP left red-faced

లోకసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా నైతిక నియమావళిని ఉల్లంఘించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ముజఫర్‌నగర్ పోలీసులు అమిత్ షాపై బుధవారం ఛార్జీషీటు నమోదు చేశారు. ‘ఈ ఎన్నికలు ప్రతీకారం, గౌరవానికి సంబందించినవి' అని అమిత్ షా తన ప్రసంగంలో చెప్పినట్లుగా ఉన్న ఓ వీడియో ఆధారంగా పోలీసులు ఆయనపై కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేశారు. అయితే కోర్టు ఛార్జీషీటును తిరస్కరింది.

అప్పుడు చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలు నిరసన తెలిపాయి. అంతేగాక ఇతర పార్టీలతోపాటు కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా, అమిత్ షాపై ఛార్జీ షీటు నమోదు చేయడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ స్వాగతించింది. ఆలస్యమైనప్పటికీ సరైన నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది.

English summary
In a major embarrassment for the Samajwadi Party government led by Chief Minister Akhilesh Yadav, a local court on Thursday returned the chargesheet filed yesterday by the Uttar Pradesh Police against BJP national president Amit Shah for an alleged hate speech he made in April ahead of the national election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X