Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హత్రాస్ గ్యాంగ్ రేప్ దోషి సందీప్ సిసోడియాకు జీవితఖైదు విధించిన కోర్టు.. ట్విస్ట్ ఏంటంటే!!

హత్రాస్ గ్యాంగ్ రేప్ దోషి సందీప్ సిసోడియాకు జీవితఖైదు విధిస్తూ యూపీ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది.

2020 సెప్టెంబరులో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ మరియు మర్డర్ కేసులో గురువారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు తీర్పును వెల్లడించింది. నలుగురు నిందితులలో ఒక్కరిని మాత్రమే దోషిగా తేల్చిన కోర్టు తీర్పు ఇచ్చింది.

హత్రాస్ హత్యాచారం కేసులో దోషికి జీవిత ఖైదు

హత్రాస్ హత్యాచారం కేసులో దోషికి జీవిత ఖైదు

19 ఏళ్ళ దళిత బాలికను దారుణంగా అత్యాచారం చేసి, ఆపైన చిత్రహింసలకు గురిచేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 15 రోజులపాటు చావుతో కొట్లాడి దళిత బాలిక ప్రాణాలు కోల్పోయింది. తాజాగా హత్రాస్ లో సంచలనంగా మారిన సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఏకైక దోషిగా సందీప్ సిసోడియా ఠాకూర్ ను తేల్చిన కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది.

ముగ్గురు నిందితులపై కేసు కొట్టేసిన కోర్టు

ముగ్గురు నిందితులపై కేసు కొట్టేసిన కోర్టు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్సీ ,ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి త్రిలోక్ పాల్ సింగ్ ఈ కేసులో సందీప్ సిసోడియాను దోషిగా పేర్కొంటూ తీర్పును వెల్లడించారు. ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న మరో ముగ్గురు నిందితులైన రవి, లవ్ కుశ్, రాములపై ఉన్న కేసులను కొట్టివేసినట్టు కోర్టు పేర్కొంది. ముగ్గురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసిన కోర్టు ప్రధాన నిందితుడు సందీప్ సిసోడియా ఠాకూర్ కు 50 వేల రూపాయల జరిమానా తో పాటు యావజ్జీవ కరగర శిక్షను విధించింది.

సందీప్ సిసోడియాకు శిక్ష .. కేసులో ట్విస్ట్ ఇదే

సందీప్ సిసోడియాకు శిక్ష .. కేసులో ట్విస్ట్ ఇదే

అయితే ఈ కేసులో ట్విస్ట్ ఏమిటంటే సందీప్ సిసోడియా ఠాగూర్ కు కోర్టు అత్యాచారం ఆరోపణల పై శిక్ష వెయ్యలేదని తెలుస్తుంది . ప్రధాన నిందితుడిని హత్య, అత్యాచారం అభియోగలపై కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒక యువతి మరణానికి కారకుడు అయ్యాడు అన్న ఆరోపణలపై కోర్టు శిక్ష విధించింది. ఐపీసీ లోని సెక్షన్ 304 కింద నిందితుడి నిర్లక్ష్యం వల్ల యువతి చనిపోవడానికి కారణం అయ్యాడన్న నేరం పైన అతనికి శిక్ష విధించింది ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు. సామూహిక అత్యాచారం జరిపినట్టు ఎటువంటి ఆధారాలు లభించలేదని పేర్కొంది.

హైకోర్టులో అప్పీల్ కు వెళ్తామన్న శిక్ష పడిన దోషి తరపు న్యాయవాది

హైకోర్టులో అప్పీల్ కు వెళ్తామన్న శిక్ష పడిన దోషి తరపు న్యాయవాది


ఇక ఇదే విషయాన్ని సందీప్ సిసోడియా ఠాగూర్ తరపున వాదించిన అడ్వకేట్ వెల్లడించారు.తమ క్లయింట్ అమాయకుడని, ఎటువంటి నేరం చేయలేదని మనిషి సిసోడియా ఠాకూర్ తరఫున వాదించిన న్యాయవాది మున్నావర్ సింగ్ పుందిర్ పేర్కొన్నారు. తన క్లయింట్ పై అత్యాచార నేరం నిరూపించబడలేదని స్పష్టం చేశారు. ఈ శిక్ష పై హైకోర్టులో అప్పీలు చేస్తామని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+